(Local) Sun, 12 Jul, 2020

ప్రయోగాలూ విజయవంతం కావని నాకు తెలుసు-అఖిలేష్

June 06, 2019,   1:40 PM IST
Share on:
ప్రయోగాలూ విజయవంతం కావని  నాకు తెలుసు-అఖిలేష్

మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ తో ఉత్తరప్రదేశ్ లో లోక్‌సభ ఎన్నికలకు కూటమిగా ఏర్పడడం ఒక ప్రయోగమని, అయితే ఒక్కోసారి ప్రయోగాలు ఫలితాన్నివ్వవని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బుధవారం వ్యాఖ్యానించారు. ‘నేను మైసూరులో ఇంజినీరింగ్ చదివారు. అన్ని వేళలా అన్ని ప్రయోగాలూ విజయవంతం కావని సైన్స్ స్టూడెంట్‌గా నాకు తెలుసు. అయినా ఒక ప్రయత్నం చేశాం. అవరోధమేమిటో తెలుసుకున్నాం’ అని అఖిలేష్ ఒక వార్తాసంస్థతో అన్నారు.

‘ఎస్‌పితో కూటమికి దూరంగా ఉండాలనుకుంటున్నందువల్లే ఉత్తరప్రదేశ్‌లో 11 స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో బిఎస్‌పి ఒంటరిగా పోటీ చేయాలనుకుంటోంది. అయితే మాయావతి చెప్పినట్టు ఇది శాశ్వతంగా విడిపోవడం కాదు’ అని యుపి మాజీ సిఎం అభిప్రాయపడ్డారు. అయితే ఆమె అంటే తనకూ ఎప్పటికీ గౌరవమేనన్నారు. ‘నేను మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో… మాయావతి గౌరవమే నా గౌరవం అని చెప్పాను. ఇప్పటికీ అదే చెబుతాను’ అన్నారు. యుపి అసెంబ్లీ ఎన్నిల్లో ఎస్‌పి బిఎస్‌పితో చేతులు కలిపే అవకాశం ఉందా అని అడగ్గా … ‘ఇప్పుడు మా దృష్టి అంతా ఉప ఎన్నికలపైనే. 2022 ఎన్నికల వ్యూహం తర్వాత నిర్ణయిస్తాం’ అన్నారు అఖిలేష్.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.