(Local) Mon, 20 May, 2019

చిత్రలహరి తో తేజు కు హిట్ పడ్డట్లే..

March 19, 2019,   9:41 PM IST
Share on:

సాయి ధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్.. ఇప్పుడు చిత్రలహరి టీజర్ చూసిన తర్వాత సాయి ధరంతేజ్ అభిమానులు కచ్చితంగా ఇదే ఫీలవుతారు. మొన్నటివరకు ఆయన  సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో చాలా గ్యాప్ తీసుకొని చిత్రలహరి సినిమా చేస్తున్నాడు మెగా మేనల్లుడు. ఈ సారి ఖచ్చితంగా ఏదో మాయ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దానికి తోడు దర్శకుడు కిషోర్ తిరుమల కూడా ఈ సినిమాలో చాలా విషయం దాచి పెట్టాడని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. ఇందులో నాలుగు పాత్రలు కీలకంగా ఉండబోతున్నాయి..కళ్యాణి ప్రియదర్శినితో పాటు మరో హీరోయిన్ నివేదా పేతురాజ్ కూడా ఈ సినిమాలో సాయి ధరమ్ పక్కన హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్‌లో తేజూ సరికొత్త లుక్ లో కనిపించడమే కాదు అయన క్యారెక్టర్ కూడా చాల కొత్తగా ఉంది. ఈ సినిమాలో తేజూ పాత్ర పేరు విజయ్. తన పేరులో ఉన్న విజయం తన జీవితంలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉండే పాత్ర ఇది. ఇక సునీల్ మరోసారి తనలోని చమత్కారంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా కనిపిస్తున్నారు.లవ్, ఎమోషన్ ఇలా అన్నిటిని సమపాళ్లలో చేస్తూ కిశోర్ తిరుమల అద్భుతంగా ఈ సినిమా చేశాడనిపిస్తుంది. తప్పకుండా ఆడియెన్స్ మెప్పు పొందేలా ఈ మూవీ ఉంటుందని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది.  టీజర్ తో మంచి మార్కులు కొట్టేసిన సాయి ధరమ్ తేజ్.. ఏప్రిల్ 12 న ఏం చేస్తాడో చూడాలి.  

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.