
1970 లలో ఉస్మానియా యూనివర్సిటీలో జార్జ్ రెడ్డి అనే పేరు మారుమ్రోగిపోయేది. యూనివర్సిటీ టాపర్ గా ఉంటూ విద్యార్థుల తరుపున పోరాడిన జార్జ్ రెడ్డి గురుంచి ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు. చరిత్ర మరిచిన ఒక గొప్ప విద్యార్ధి నాయకుడి తెలియజేయడానికి డైరెక్టర్ జీవన్ రెడ్డి తీసిన "జార్జి రెడ్డి " సినిమా ఈరోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ : జార్జిరెడ్డి (సందీప్ మాధవ్) తన చిన్నతనం నుండి అన్యాయం పై ఎదురుతిరిగే ఆవేశం పూరితమైన స్వభావం గల వ్యక్తి. తల్లి ప్రోత్సాహంతో చిన్నతనం నుండే భగత్ సింగ్, చేగువేరా ల జీవితాలను చదువుతూ ఉండే జార్జి రెడ్డికి వారి లాగే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను కలిగి తన ముందు ఎలాంటి అన్యాయం జరిగిన వాటికి ఎదురు తిరుగుతుంటాడు. చదువుతో పాటు అనేక విషయాల్లో జార్జి రెడ్డి చురుకుగా ఉంటాడు. ఉన్నత విద్య కోసం ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగుబెట్టిన తరువాత జార్జి రెడ్డి జీవితమే మారిపోతుంది. యూనివర్సిటీ టాపర్ గా, విద్యార్ధి నాయకుడిగా ఉన్న జార్జి రెడ్డిని కొంతమంది దారుణంగా హత్య చేస్తారు. అసలు జార్జిరెడ్డిని హత్య చేసిందెవరు? ఎందుకు హత్య చేశారు? అనే విషయాలు తెర మీద చూడాల్సిందే..!
ప్లస్ పాయింట్స్ : వంగవీటి సినిమాలో వంగవీటి రంగా, రాధా పాత్రలలో సూపర్ గా నటించిన సందీప్ మాధవ్ జార్జి రెడ్డి పాత్రలో కూడా ఒదిగిపోయాడు. బాడీ లాంగ్వేజ్, దుస్తులు, హావభావాలు అచ్చం జార్జిరెడ్డిని తలపించేలా చేశాడు. ముఖ్యం కొన్ని సీన్ లలో సందీప్ చెప్పే డైలాగ్స్ తో జార్జి రెడ్డిని కళ్ళముందు చూస్తునట్లుగానే ఉంటుంది. ఇక మిలిగిన పాత్రల్లో జార్జి రెడ్డి తల్లిగా చేసిన మరాఠీ నటి దేవిక అద్భుతంగా నటించింది. సత్య దేవ్ కి పవర్ ఫుల్ పాత్ర ఉన్నప్పటికి సరైన సీన్స్ పడలేదు. సత్యదేవ్ పాత్రే మరీ అర్థాంతరంగా ముగిసిపోయిందనిపిస్తుంది. జార్జి రెడ్డి స్నేహితులుగా నటించిన అభయ్, యాదమ్మరాజు సూపర్బ్ గా నటించారు.
మైనస్ పాయింట్స్ : కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కొన్నిసన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు జీవన్ మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. అవసరం లేదేమో అనుకునే సన్నివేశాలూ వస్తుంటాయి. దాని వల్ల నిడివి పెరుగుతూ పోయింది. పైగా కొన్ని యాక్షన్ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం కూడా సినిమాకి మరో మైనస్ పాయింట్ గా నిలుస్తోంది.
సాంకేతిక విభాగం : ఇలాంటి బయోపిక్ చిత్రాలకు బ్యాక్ గ్రౌండ్ చాల అవసరం..సినిమాను నిలబెట్టేది కూడా అదే..ఆ విషయంలో సురేష్ బొబ్బిలి ని మెచ్చుకోవాలి. అద్భుతమైన ఆర్ఆర్ అందించాడు. చాలా సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని నిలబెట్టింది. ఇక దర్శకుడు జీవన్ రెడ్డి గురించి చెప్పాలంటే..తాను అనుకున్నది అనుకున్నట్లుగా స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేశాడు. కానీ పూర్తిస్థాయిలో మాత్రం చూపించలేకపోయారు. ప్రతాప్ కుమార్ ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది అనిపించింది. సినిమాటోగ్రాఫర్ సుధాకర్ యక్కంటి.. తన కెమెరాతో మ్యాజిక్ చేశాడు. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ సాయంతో 70ల నాటి ఉస్మానియా యూనివర్శిటీ వాతావరణాన్ని అతను తెరపైకి తీసుకొచ్చిన వైనం అమోఘం. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు బాగున్నాయి.
తీర్పు : విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా జార్జ్ రెడ్డి లాంటి టెర్రిఫిక్ లీడర్ గురించి, ఆయన ఆలోచన విధానం గురుంచి తెలుసుకోవటానికైనా ఈ సినిమాని చూడొచ్చు.
రేటింగ్ : 3 / 5
-
రివ్యూ: రాగాల 24 గంటల్లో
22 Nov 2019, 5:34 PM
-
రేపే గ్రాండ్‌గా వస్తున్న ‘రాగల 24 గంటల్లో’....
21 Nov 2019, 6:21 PM
-
‘జార్జి రెడ్డి’ విజయం సాంగ్ రిలీజ్....
14 Nov 2019, 6:28 PM
-
బుల్లెట్ సాంగ్ – జార్జ్ రెడ్డి
06 Nov 2019, 7:29 PM
-
రాగల 24 గంటల్లో - ట్రైలర్ రిలీజ్
06 Nov 2019, 6:03 PM
-
ఓ నా బుజ్జి జొన్నా నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్ ...
01 Nov 2019, 6:57 PM
-
బీజేపీ నేతలు ఉగ్రవాదం పేరుతో రెచ్చగొడుతున్నారు: జీ ...
01 Nov 2019, 12:41 PM
-
పూజకి చాలానే ఆశలున్నాయ్!!
23 Oct 2019, 4:00 PM
-
"మాసు బీటే మోగిందిరా మామ" సాంగ్ తో అదరగొడుతున్న శ్ ...
16 Oct 2019, 1:55 PM
-
`జార్జ్‌రెడ్డి` ట్రైలర్ విడుదల....
08 Oct 2019, 11:09 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
రివ్యూ: రాగాల 24 గంటల్లో
22 Nov 2019, 5:34 PM
-
రివ్యూ: యాక్షన్
15 Nov 2019, 5:49 PM
-
రివ్యూ: ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’
15 Nov 2019, 4:34 PM
-
రివ్యూ: తిప్పరామీసం
08 Nov 2019, 4:08 PM
-
రివ్యూ: ఆవిరి
01 Nov 2019, 4:26 PM
-
రివ్యూ: మీకు మాత్రమే చెప్తా
01 Nov 2019, 3:39 PM
-
రివ్యూ: ఖైదీ
25 Oct 2019, 4:43 PM
-
రివ్యూ:విజిల్
25 Oct 2019, 3:43 PM
-
రివ్యూ: 'రాజుగారి గది 3'
18 Oct 2019, 5:31 PM
-
రివ్యూ: చాణక్య
05 Oct 2019, 4:46 PM
-
రివ్యూ: సైరా నరసింహారెడ్డి
02 Oct 2019, 12:44 PM
-
రివ్యూ: బందోబస్త్
20 Sep 2019, 4:40 PM
-
రివ్యూ: గద్దలకొండ గణేష్
20 Sep 2019, 4:16 PM
-
రివ్యూ: గ్యాంగ్ లీడర్...
13 Sep 2019, 4:27 PM
-
రివ్యూ: జోడి
06 Sep 2019, 5:18 PM
-
రివ్యూ: '2 అవర్స్ లవ్`
06 Sep 2019, 4:11 PM
-
రివ్యూ : సాహో
30 Aug 2019, 10:24 AM
-
రివ్యూ: ఏదైనా జరగొచ్చు
23 Aug 2019, 4:48 PM

రివ్యూ: రాగాల 24 గంటల్లో

రేపే గ్రాండ్‌గా వస్తున్న ‘రాగల 24 గంటల్లో’....
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.