(Local) Thu, 02 Jul, 2020

రివ్యూ : కెజిఎఫ్ ఛాప్టర్ వన్

December 21, 2018,   11:00 PM IST
Share on:
రివ్యూ : కెజిఎఫ్ ఛాప్టర్ వన్

విడుదలకు ముందే ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న చిత్రం కెజియఫ్. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..

కథ :ఇది 1951లో మొదలై 1981 దాకా సాగే కథ. ఎలా పుట్టాం అనే కంటే పోయేటప్పుడు మాత్రం ధనవంతుడిగా చావాలన్న అమ్మ మాటను నరనరాల్లో జీర్ణించుకున్నరామకృష్ణ పవన్ అలియాస్ రాకీ(యష్) బాల్యం నుంచే ఆ కసితో ఎదుగుతూ ఉంటాడు. ముంబై వీధుల్లో మొదలైన అతని ప్రయాణం డాన్ గా చెలామణి అవుతున్న శెట్టి సహకారంతో ముంబై స్మగ్లింగ్ తో పాటు ఆఫ్రికా నుంచి దిగుమతి అవుతున్న దొంగ బంగారం మీద ఆధిపత్యం సాగించేలా చేస్తుంది. ఇంకా పెద్దగా ఎదగాలి అనుకున్న రాకీ కోలార్ లో ఉన్న నరాచి మైనింగ్ కార్పొరేషన్ ని తన గుప్పెట్లో పెట్టుకున్న గరుడ(రామచంద్ర రాజు)ను  చంపే అసైన్మెంట్ మీద బెంగుళూరు వస్తాడు. రాగానే రాజేంద్ర దేశాయ్(లక్ష్మణ్) కూతురు నీనా(శ్రీనిధి శెట్టి)ప్రేమలో పడతాడు. అలా పక్కా స్కెచ్ తో ఒక్కో అడుగు వేస్తూ శత్రుభేద్యమైన కోలార్ బంగారు గనుల్లో బాససగా అడుగు పెడతాడు. ఆ సామ్రాజ్యానికి చక్రవర్తి కావాలనే లక్ష్యం ఎంత వరకు నెరవేర్చుకున్నాడు అనేదే కెజిఎఫ్

ప్లస్ పాయింట్స్ :హీరో యష్ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్ గా నిలిచాడు. స్టైలిష్ లుక్ తో సినిమా అంత వన్ మ్యాన్ షో చేశాడు. ఇక హీరో ఇంట్రో సీన్ అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు యాక్షన్ సీక్వెన్స్ లు మాస్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన పాత్ర పరిధి మేర నటించింది.ఇక స్పెషల్ సాంగ్ లో మెరిసిన మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామరస్ గా కనిపించింది. ఇక ఇంతవరకు ఎవరు టచ్ చేయని పాయింట్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో ఈ కథ రాసుకోవడం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

మైనస్ పాయింట్స్ :ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ కోలార్ గోల్డ్ బ్యాక్‌డ్రాప్‌తో నేప‌ధ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ప‌క్కాగా స్క్రిప్ట్ రాసుకోలేదు. హీరోను ఎలివేట్ చేయ‌డం మీదనే శ్రద్ధ పెట్టు క‌థ‌నం గురించి మర్చిపోయాడు. హీరో ఇమేజ్ కు తగ్గట్లు యాక్ష‌న్ స‌న్నివేశాలతో నింపేసిని ద‌ర్శ‌కుడు, ఎమోషనల్ స‌న్నివేశాలను పట్టించుకోలేదు .

సాంకేతిక వర్గం:రవి బస్నూర్-తనిష్క్ ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ని బాగా క్యారీ చేసింది కాని పాటలు కనీస స్థాయిలో కూడా లేవు. ఏదో రొదలా అనిపిస్తాయి తప్ప ఇంకే విశేషమూ లేదు. తమన్నా సాంగ్ వృధా అయిపోయింది. ఆన్ లైన్ లో వదిలిన మౌని రాయ్ పాటను ఎందుకో మరి లేపేశారు. బహుశా రెండూ ఐటెం సాంగ్స్ అవుతాయన్న కారణం కావొచ్చు.

ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది భువన గౌడ ఛాయాగ్రహణం గురించి. ముంబై బ్యాక్ డ్రాప్ లో ఫస్ట్ హాఫ్ ని ఊహల్లో మాత్రమే చూడడానికి సాధ్యమయ్యే కోలార్ బంగారు గనుల నేపధ్యాన్ని రెండు విభిన్నమైన కలర్ స్కీంస్ లో చూపించిన తీరు టాప్ స్టాండర్డ్ లో ఉంది. తనకు వంక పెట్టే అవకాశం ఎక్కడా ఇవ్వలేదు. అందరి కంటే ఎక్కువ ప్రశంశలకు అర్హుడు ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్. కోలార్ సెటప్ ని తీర్చిదిద్దిన తీరు అవార్డులు తెచ్చిపెట్టినా ఆశ్చర్యం లేదు. విజువల్ ఎఫెక్ట్స్ సహకారం తీసుకున్నా చాలా సహజంగా అనిపించేలా ఆనాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు పునఃసృష్టి చేసిన తీరు అభినందనీయం.

తీర్పు :భారీ హైప్ తో వచ్చిన ఈ కె జి యఫ్ అంచనాలను అందుకోలేకపోయింది. యష్ లుక్స్ అలాగే ఆయన నటన సినిమాకు హైలైట్ అవ్వగా వీక్ స్టోరీ , స్లో నరేషన్ సినిమా ఫలితాన్ని దెబ్బతిశాయి. చివరగా ఈ చిత్రం ఏ వర్గాన్ని కూడా మెప్పించలేకపోయింది.

రేటింగ్ : 2.5 / 5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.