(Local) Mon, 20 Sep, 2021

రివ్యూ: ఖైదీ

October 25, 2019,   4:43 PM IST
Share on:
రివ్యూ: ఖైదీ

కోలీవుడ్ హీరో కార్తీ సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆదరిస్తారు. హీరో కార్తీ ఎంచుకునే కథ కూడా ఎంతో విభిన్నంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు...డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన చిత్రం 'ఖైదీ'. ఫాదర్ – డాటర్ ఎమోషన్ ని కీలకంగా చేసుకొని కంప్లీట్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ సమర్పిస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ : పోలీస్ ఆఫీసర్ విజయ్(నరేన్ కుమార్), తన టీంతో కలిసి 900 కిలోల డ్రగ్స్ అనగా 840 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టుకుంటారు. ఆ డ్రగ్స్ ని పోలీస్ స్టేషన్ లో భద్ర పరుస్తారు. జీవిత ఖైదు చేయబడిన ‘ఢిల్లీ’ (కార్తీ) అనే ఖైదీ తన జీవితంలో మొదటిసారి తన కూతురుని చూడటానికి ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎంతో ఆశతో జైలు నుండి బయల్దేరతాడు. ఒక పెద్ద ప్రమాదం  నుంచి 40 మంది పోలీసుల్ని కాపాడాల్సిన  బాధ్యత అతడిపై పడుతుంది. అంతమంది పోలీసులు అతడిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది.. అసలు హీరో ఎందుకు జైలుకు వెళ్ళాడు, ఎందుకు తప్పించుకున్నాడు, పోలీసులను తనని చుట్టుముట్టిన గుండాలను ఎదిరించి బ్రతికాడా లేదా అన్నది ఓవరాల్ సినిమా కథ…

ప్లస్ పాయింట్స్ : ఖాకీ సినిమా తర్వాత కార్తి నటించిన ఫుల్ లెంగ్త్ మాస్ మూవీ ఖైది. సినిమా స్టార్టింగ్ నుండి చివరి వరకు కార్తి తన నటనతో ఆకట్టుకున్నాదు. కార్తీ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్. సాధారణంగా సినిమాల్లో హీరోలను ఎలివేట్ చేయడం కోసం విలన్స్ ను చాలా దారుణంగా ప్రాజెక్ట్ చేస్తారు. విలన్ పాత్రలకు కూడా ఒక గౌరవం ఇచ్చిన మొట్టమొదటి సినిమా “ఖైదీ” అని చెప్పొచ్చు. మొత్తానికి కథ సింపుల్ గా ఉన్న ప్రతి సీక్వెన్స్ లో ప్లే ఇంట్రస్టింగ్ గా ఉంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో. ఇక కార్తీ, ఖైదీ పాత్రలో అద్భుతంగా నటించారు. క్లిష్టమైన కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కమర్షియల్‌ సినిమా అనగానే ప్రధానంగా ముచ్చటించుకునే హీరోయిన్‌, సాంగ్స్ మరియు కామెడీ ఈ సినిమాలో లేకపోయినా.. వాటికి మించిన కథ, బలైమన ఎమోషన్, అలాగే ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాలో ఉన్నాయి. కార్తీ కూతురుగా చేసిన పాప నటన బాగుండడమే కాకుండా అందరినీ ఎమోషనల్ గా సినిమాకి కనెక్ట్ చేస్తుంది. అలాగే క్లైమాక్స్ లో అతని నటన మనల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. నటుడిగా కార్తీ రేంజ్ ను మరోసారి చాటి చెప్పిన చిత్రంగా ఖైదీ నిలుస్తుంది. పోలీస్ అధికారిగా నరేన్ నటన కూడా ఆకట్టుకుంటుంది. కార్తీ వెంట ఉండే కుర్రాడు కూడా బాగా చేసాడు. మిగిలిన నటీనటులందరూ తమ పరిధి మేర రాణించారు. ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించే కొన్ని మెరుపు సన్నివేశాలు ద్వితీయార్ధానికి హైలైట్ గా నిలిచాయి.

మైనస్ పాయింట్స్ : మంచి స్టోరీతో, దర్శకుడు మంచి అటెంప్ట్ చేసినా కథలో పెద్ద స్పాన్ లేకపోవడంతో సినిమాలో ఎక్కువగా ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ను పెట్టే అవకాశం మిస్ అయింది. ప్రథమార్ధంలో కథనం కొంత నెమ్మదిగా సాగినా.. ద్వితీయార్ధంలో మాత్రం రయ్యిన పరుగులు పెడుతుంది. హరీష్ పేరడి చేసిన విలన్ పాత్ర చాలా ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉంటే హీరో – విలన్ వార్ ఇంకా రసవత్తరంగా ఉండేది. రెగ్యులర్ ఆడియన్స్ కోరుకునే పాటలు, కామెడీ బిట్స్ లేకపోవడం.

సాంకేతిక విభాగం : సాంకేతికంగా ఖైదీ ఉన్నతంగా నిలిచే చిత్రం.లోకేష్ కనకరాజ్ మాస్టర్ డైరెక్టర్ అనిపించుకున్నాడు.సామ్ సి.ఎస్ నేపథ్య సంగీతం సన్నివేశాల్ని ఎలివేట్ చేయడంలో.. ప్రేక్షకుల్లో భావోద్వేగాల్ని రేకెత్తించడంలో కీలక పాత్ర పోషించింది. సత్యన్ సూర్యన్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ లో యాక్షన్ సన్నివేశాల్లో సీన్ లోని మూడ్ ని తన కెమెరా యాంగిల్స్ తో కళ్ళకు కట్టినట్టు చూపించారు ఆయన. సంగీత దర్శకుడు సామ్ సి.ఎస్ కెరీర్ బెస్ట్ బీజీయం వర్క్ ఈ చిత్రం. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ కూడా సూపర్ స్పీడ్ గా ఉంది.ప్రొడక్షన్ వేల్యూస్ అదిరిపోయాయి. ఒక సినిమాకి ఎంత ఖర్చు చేయాలో అంతే చేశారు.

తీర్పు : విభిన్నమైన కథతో వైవిధ్యంగా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. బలమైన యాక్షన్ అండ్ ఎమోషన్ తో పాటు కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ తో చాల వరకూ ఇంట్రస్టింగ్ గా సాగుతూ ఆకట్టుకుంటుంది.మొత్తానికి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఖైదీ.

రేటింగ్ : 3.5/5
 

సంబంధిత వర్గం
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
దీపావళికి పోటీ పడనున్న తమిళ్ స్టార్స్...
దీపావళికి పోటీ పడనున్న తమిళ్ స్టార్స్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.