
2014లో హృదయ కాలేయం’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షుకులకి పరిచయమైనా సంపూర్ణేష్ బాబు. ఆ తర్వాత పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ అపుడప్పుడు హీరోగా కూడా కనిపించి ప్రేక్షుకులని కడుపుబ్బా నవ్విస్తున్నాడు. 2014లో హృదయ కాలేయం సినిమా చేస్తూనే మరో సినిమా అయిన కొబ్బరిమట్ట కూడా ప్రారంభించాడు. రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎప్పుడో విడుదలకావాల్సి ఉన్న అనుకోని కారణాల వల్ల విడుదల ఆలస్యం అయింది. హృదయ కాలేయం సినిమాలో సంపూర్ణేష్ బాబు తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ తో బాగానే నవ్వించాడు. సంపూ తాజాగా నటించిన “కొబ్బరి మట్ట” మూవీ నేడు విడుదలైంది. మరి ఆ మూవీ ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో చర్చిద్దాం.
కథ: పెదరాయుడు (సంపూర్ణేష్ బాబు) గ్రామ పెద్దగా ఎదైనా అన్యాయం జరిగితే తన తీర్పును ఇచ్చి వారిని ఆదుకొంటాడు. ముగ్గురు భార్యలు, ముగ్గురు సోదరులు, ఇద్దరు చెల్లెలతో ఓ కుటుంబానికి పెద్దగా ఉంటాడు. అలాంటి రాయుడు జీవితం యాండ్రాయుడు(సంపూర్ణేష్ బాబు) రాకతో ఒడిదుడుకులకు లోనవుతుంది. అసలు ఎవరు ఈ యాండ్రాయుడు? అతనికి రాయుడికి ఉన్న సంబంధం ఏమిటి? అతనికి పెదరాయుడుకి సంబంధం ఏంటి? అతను పెదరాయుడు పోలికలతో ఎందుకు పుడతాడు? అన్నదే కామెడీ కథలో కీలకం.
ప్లస్ పాయింట్స్: దర్శకుడు సాయి రాజేష్ ఈ మూవీలో సంపూర్ణేష్ చేత పాపారాయుడు,పెద్ద రాయుడు,యాండ్రాయుడు అనే మూడు విభిన్న పాత్రలు చేయించి మంచి హాస్యాన్ని తెరపై పండించారు.ఈ మూడు పాత్రల్లో సంపూర్ణేష్ బాబు ఓ పెద్ద అరాచకమే చేశారు. వన్ మేన్ షోతో పొట్టచెక్కలు చేశాడు. సీన్ సీన్లో పంచ్.. ఆ పంచ్‌లో ఫన్.. ఆ ఫన్‌తో ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించాడు. డాన్స్, ఫైట్లతో సహా కడుపుబ్బా నవ్వించారు. ఇక ఈ మూవీలో కీలకమైన పాత్ర దక్కించుకున్న కత్తి మహేష్ సమకాలిక అంశాలపై వేసే సెటైర్స్ చక్కగా పేలాయి. మరో ముఖ్య పాత్రలో నటించిన షకీలా డీసెంట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటుంది. సందర్భానుసారంగా వచ్చే సాంగ్స్ కూడా మంచి హాస్యం పంచుతూ అలరిస్తాయి. ఈ మూవీకి హాస్యంకోసం వెళ్లే ప్రతి ప్రేక్షకుడు నిరుత్సాహపడరు. అంతగా సంపూ ఈ మూవీలో నవ్వించాడు అని చెప్పాలి. ఇక ఆండ్రాయుడు చెప్పే 3.27 నిమిషాల భారీ డైలాగ్‌కి థియేటర్స్‌లో చప్పట్ల మోత మోగింది.
మైనస్ పాయింట్స్: సంపూర్ణేష్ బాబు బాగా పరిచయమున్న ఆడియన్స్ కి , కామెడీని అంటే అమితంగా ఇష్టపడే వారికి మినహా మిగతా వారికి సన్నివేశాలు చాలా సిలీగా అనిపిస్తాయి. లాజిక్ లేని సన్నివేశాలు ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చక పోవచ్చు.
సాంకేతిక విభాగం: చిత్ర బడ్జెట్ పరిధిలో నిర్మాణ విలువలు డీసెంట్ గా పర్వాలేదు అనిపిస్తాయి. హై పిచ్ లో నడిచే అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. కథనం, మాటలు గురించి. ‘హృదయకాలేయం’ సృష్టికర్త స్టీవెన్ శంకర్ సుమారు ఐదేళ్ల పాటు ఈ సినిమాను సొంతంగా నిర్మించారు. వాస్తవానికి ఈ ఐదేళ్లలో కొబ్బరి మట్ట షూటింగ్ జరిగింది 39 రోజులే. మూవీ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. మూవీ ప్రతి పదినిమిషాల వ్యవధిలో చక్కగా చొప్పించిన హాస్య సన్నివేశాలు ఆహ్లదం కలిగిస్తాయి. ఇక దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్ మూవీ అక్కట్టుకొనేలా తీయడంలో ఎంత కష్టపడ్డారో తెరపై కనిపిస్తుంది. కథలో కానీ సన్నివేశాలలో కానీ ఎటువంటి లాజిక్ లేకపోయినప్పటికీ తాను అనుకున్న విధంగా సంపూర్ణేష్ తో తెరపై హాస్యం పండించడంలో విజయం సాధించారు అని చెప్పొచ్చు.
తీర్పు: మొత్తంగా చెప్పాలంటే కొబ్బరి మట్ట సంపూర్ణేష్ బాబు అభిమానులను ఆద్యంతం అలరించే సంపూర్ణమైన కామెడీ మూవీ.
రేటింగ్: 3/5
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
రివ్యూ: రాగాల 24 గంటల్లో
22 Nov 2019, 5:34 PM
-
రివ్యూ: జార్జిరెడ్డి
22 Nov 2019, 2:57 PM
-
రివ్యూ: యాక్షన్
15 Nov 2019, 5:49 PM
-
రివ్యూ: ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’
15 Nov 2019, 4:34 PM
-
రివ్యూ: తిప్పరామీసం
08 Nov 2019, 4:08 PM
-
రివ్యూ: ఆవిరి
01 Nov 2019, 4:26 PM
-
రివ్యూ: మీకు మాత్రమే చెప్తా
01 Nov 2019, 3:39 PM
-
రివ్యూ: ఖైదీ
25 Oct 2019, 4:43 PM
-
రివ్యూ:విజిల్
25 Oct 2019, 3:43 PM
-
రివ్యూ: 'రాజుగారి గది 3'
18 Oct 2019, 5:31 PM
-
రివ్యూ: చాణక్య
05 Oct 2019, 4:46 PM
-
రివ్యూ: సైరా నరసింహారెడ్డి
02 Oct 2019, 12:44 PM
-
రివ్యూ: బందోబస్త్
20 Sep 2019, 4:40 PM
-
రివ్యూ: గద్దలకొండ గణేష్
20 Sep 2019, 4:16 PM
-
రివ్యూ: గ్యాంగ్ లీడర్...
13 Sep 2019, 4:27 PM
-
రివ్యూ: జోడి
06 Sep 2019, 5:18 PM
-
రివ్యూ: '2 అవర్స్ లవ్`
06 Sep 2019, 4:11 PM
-
రివ్యూ : సాహో
30 Aug 2019, 10:24 AM

వరద బాధితులకు విరాళం అందించిన బర్నింగ్ స్టార్...!
Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.