(Local) Mon, 20 Jan, 2020

రివ్యూ :మహర్షి

May 09, 2019,   12:53 PM IST
Share on:
రివ్యూ :మహర్షి

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మ‌హ‌ర్షి మ‌హేష్ అభిమానుల‌కు స‌మ్మ‌ర్ ట్రీట్ లా అనిపిస్తుంది. హీరోయిజానికి ఎక్క‌డా లోటు లేకుండా చూసుకుంటూనే ఓ బ‌ర్నింగ్ పాయింట్‌ని ఎంచుకున్నాడు దర్శకుడు . మ‌రి ఈసారి ఎలాంటి ఫ‌లితం వ‌చ్చింది? మ‌హేష్ న‌మ్మ‌కాన్ని వంశీ పైడిప‌ల్లి ఎంత వ‌ర‌కూ నిల‌బెట్టుకున్నాడు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే ?

కథ :అమెరికన్ బేసెడ్ కంపెనీ అధినేత  రుషి కుమార్ (మ‌హేష్ బాబు)కు ఓడిపోవటం అంటే ఇష్టం ఉండదు. ఓటమి అంటే భయంతో అతను ఎప్పుడూ గెలుపు కోసం ప్రయత్నిస్తూ  బిజినెస్ లో దూసుకుపోతూంటాడు. అయితే త‌న జీవితం, త‌న విజ‌యాలు త‌నొక్క‌డి క‌ష్టానికి వ‌చ్చిన ప్ర‌తిఫ‌లాలు కాదని, వాటి వెనుక త‌న ఇద్ద‌రి స్నేహితుల (పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్‌) క‌ష్టం, త్యాగం కూడా ఉన్నాయ‌ని గ్ర‌హిస్తాడు.మరి ఆ స్నేహితులను కలిసే ప్రాసెస్ లో రిషి మళ్ళీ రైతుగా ఎలా మారాడు అనే  జ‌ర్నీని ఎంత ఇంట్రెస్టింగ్ గా మ‌లిచారు దర్శకుడు ?

ప్లస్ పాయింట్స్ :మ‌హేష్ మ‌రోసారి త‌న కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ తో మెప్పించాడు. అల్ల‌రి న‌రేష్ కి చాలా కాలం త‌ర్వాత‌ గుడ్ కంబ్యాక్ మూవీ అనే చెప్పాలి. మ‌హేష్ – అల్ల‌రి న‌రేష్ మ‌ధ్య సింక్ .. కామెడీ స‌న్నివేశాలు అద్భుతంగా పండాయి. ఇక పూజా హెగ్డే పాత్ర పూర్తిగా స‌పోర్టింగ్ రోల్ అనే చెప్పాలి. త‌న అంద‌చందాలు.. అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. తండ్రిగా ప్ర‌కాష్ రాజ్ అభిన‌యం.. స్కూల్ టీచ‌ర్ గా రావు ర‌మేష్ న‌ట‌న‌..ఇంప్రెస్సివ్. ఇక క్రూరుడైన కార్పొరెట్ వాలాగా జ‌గ‌ప‌తిబాబు న‌ట‌న సినిమాకి మ‌రో ప్ర‌ధాన బ‌లం. క్లైమాక్స్ ముందు బ‌ల‌మైన సెంటిమెంట్ సీన్స్.. ప‌తాక స‌న్నివేశాల ఎలివేష‌న్ లో స్టార్ల న‌ట‌న మ‌రో హైలైట్. 

మైనస్ పాయింట్స్ :కేవ‌లం ఒకే అంశంతో ద్వితీయార్ధం మొత్తం న‌డిపించ‌డం కాస్త సాగదీతగా కనిపిస్తుంది. ఈ సినిమాకు లెంగ్త్ ఎక్కువ కావటంతో  టైట్ గా కథ నడవదు. చాలా చోట్ల స్లోగా, ప్లాట్ అయ్యిపోయిన ఫీలింగ్ వస్తుంది. మూడు గంటలను సినిమాలో దాదాపు అరగంట వరకూ ట్రిమ్ చేయచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లాగ్ లో చాలా మంచి ఎమోషన్స్ కూడా బోర్ కొట్టే అవకాసం ఉంటుంది. 

సాంకేతిక వర్గం : సాంకేతికంగా విజువ‌ల్ రిచ్ మూవీ ఇది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ ఆక‌ట్టుకుంది. మోహ‌న‌న్ కెమెరా ప‌నిత‌నం.. దేవీ శ్రీ రీరికార్డింగ్ ఎఫెక్టివ్ నెస్ పెంచాయి. ఎంచుకున్న నేప‌థ్యానికి త‌గ్గ‌ట్టు రాజీ అన్న‌దే లేని పెట్టుబ‌డులు తెర‌పై విజువ‌ల్ రిచ్ లుక్ ని తెచ్చాయి. కొన్ని పాట‌లు.. ఫైట్స్ లో విజువ‌ల్ రిచ్ నెస్ ఆద్యంతం క‌ట్టి ప‌డేస్తుంది. అల్ల‌రి న‌రేష్ ని రిషీ సేవ్ చేసే ఫైట్ సీన్ సినిమాకే హైలైట్.

తీర్పు :మహేశ్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్.'మహర్షి' అందరికి నచ్చే 'రిషి' జర్నీ.

రేటింగ్ :3.25/5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.