
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మించిన చిత్రం "గ్యాంగ్ లీడర్". తెలుగులో ఇష్క్, మనం లాంటి సూపర్ హిట్ మూవీలను రూపొందించి మంచి పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం పోస్టర్స్, టీజర్, ప్రోమోలు, పాటలు చూస్తే నాని, లక్ష్మీ, శరణ్య, ప్రియాంక సహా ఇతర పాత్రలు వాటి చిత్రీకరణ అన్నీ సినిమా కామెడీగా సాగే ఓ డిఫరెంట్ రివేంజ్ డ్రామా అని రివీల్ చేశాయి.పైగా ‘ఆర్ఎక్స్ 100’ కథానాయకుడు కార్తికేయ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తుండటంతో మరింత ఆసక్తి పెరిగింది. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ‘గ్యాంగ్‌లీడర్’ ఎలా ఉంది? మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ : సిటీలో ఓ బ్యాంకు లో 300 కోట్లు చోరీ జరుగుతుంది. ఈ బ్యాంక్దోపీడీ సందర్భంగా ఐదురుగు వ్యక్తులు చంపబడతారు. అదే సమయంలో సరస్వతి అనే పెద్దావిడ(లక్ష్మి) తన కొడుకుని బ్యాంకు రాబరీలో చంపేసిన వ్యక్తిని పట్టుకోవడానికి చనిపోయిన మిగిలిన నలుగురు మహిళల సాయం కోరుతుంది. వీరందరిని కలిసి పార్థసారథిని ఆశ్రయిస్తారు. ఈ పెన్సిల్ పార్థసారథి (నాని) రివెంజ్ రైటర్. హాలీవుడ్ సినిమాల్ని చూసి వాటి ద్వారా నవలలు రాసుకుంటూ ఫేమస్ రైటర్‌గా చలామణీ అవుతుంటాడు. అయితే ఈ క్రమంలో అతని దగ్గరకి ఓ ఐదుగురు ఆడవాళ్లు ఓ వ్యక్తిని చంపాలని.. దానికి సాయం చేయాలని కోరతారు. పెన్సిల్ ఈ రియల్ రివేంజ్ స్టోరిని కథగా రాసి భారీగా డబ్బు సంపాదించొచ్చన్న ఆశతో వారికి సాయం చేసేందుకు అంగీకరిస్తాడు. ఆ ఐదుగురు ఆడవాళ్లతో కలిసి పెన్సిల్ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? ఈ కథకు ఇండియాస్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ దేవ్ (కార్తికేయ)కు సంబంధం ఏంటి..? ఇంతకీ నాని ఆ ఆడవాళ్లకి ఎందుకు సాయం చేస్తున్నాడు ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ : నేచురల్ స్టార్ మరోసారి తనదైన నేచురల్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. పెన్సిల్ పార్థసారథి అనే సినిమాల డబ్బింగ్ రైటర్‌గా పాత్రలో ఒదిగిపో్యాడు నాని. ముఖ్యంగా సినిమాలో లక్ష్మీ, శరణ్య, ప్రియాంక తదితరులతో కూడిన గ్యాంగ్ తో నాని చేసిన సీన్స్ చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతాయి.విలన్‌గా కార్తికేయ తన లుక్స్, యాటిట్యూడ్‌తో మంచి విలనిజం చూపించి మెప్పించాడు. అలాగే క్లైమాక్స్ లో నాని, కార్తికేయతో చేసిన యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రియాంక అరుల్మోహన్ ఆకట్టుకోలేకపోయింది. కథలో పెద్దగా స్కోప్ లేకపోవటంతో ఆమె పాత్ర సపోర్టింగ్ రోల్‌గానే మిగిలిపోయింది. లక్ష్మీ, శరణ్య, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అనీష్ కురివిల్లా తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్ : సాధారణంగా ప్రతీకార కథలు సీరియస్‌గా సాగుతూ ప్రతి మలుపులో ఉత్కంఠను పంచేలా ఉన్నప్పటికీ ఈ రివేంజ్ స్టోరీలో ఎలాంటి అనూహ్యమైన మలుపులు ఏమీ ఉండవు. సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టినప్పటికీ.... ఆ తరువాత కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగుతుంది. ఫస్టాఫ్ లోని ఆ కొన్ని ల్యాగ్ సీన్స్ ను కూడా తగ్గించి ఉంటే సినిమా ఇంకా అద్భుతంగా వచ్చి ఉండేది. కొన్ని కీలక సీన్స్ లో లాజిక్ మిస్ అవ్వడం, అలాగే కొన్ని సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. దీనికి తోడు సెకెండ్ హాఫ్ స్లోగా సాగుతూ అక్కడక్కడ బోర్ కొడుతోంది.
సాంకేతిక విభాగం : ఐదుగురు ఆడవాళ్లు తమ ప్రతీకారాన్ని ఒకరి సహాయంతో ఎలా తీర్చుకున్నారన్న కథను హిలేరియస్ గా చెప్పడంలో విక్రమ్ కుమార్ కొంత మేర సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సినిమాకు తగ్గ ఔట్పుట్ ఇవ్వడంలో అనిరుధ్ సక్సెస్ అయ్యాడు. నిన్ను చూసే ఆనందంలో, రారా, హొయినా హొయినా పాటలు మెప్పిస్తాయి. ఇక ఎడిటింగ్ బాగుంది గాని, సెకండాఫ్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. ప్రేమ సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు చాల బాగున్నాయి.
తీర్పు : గ్యాంగ్స్ ఒకే, బ్యాంగే వీక్.....
రేటింగ్: 3/5
-
హీరో నాని కార్యాలయంలో ఐటీ సోదాలు
20 Nov 2019, 1:07 PM
-
‘90 ఎంఎల్’ తో డిశెంబర్ 5న వస్తున్న కార్తికేయ...
11 Nov 2019, 1:28 PM
-
రీమేక్ చిత్రం కోసం బ్యాట్ పట్టుకున్న షాహిద్ లుక్.. ...
01 Nov 2019, 6:33 PM
-
నాని బ్యానర్‌పై 'హిట్' చిత్రం...
24 Oct 2019, 4:11 PM
-
'అమ్మాయిలస్సలే ఇనిపించుకోరు'....అంటున్న కారికేయ
17 Oct 2019, 4:50 PM
-
చిన్న పాప లాగా బిగుసుకుపోయిన ఈ అమ్మ మా అమ్మ...నాని
15 Oct 2019, 12:37 PM
-
“జెర్సీ” హిందీ రీమేక్ లో కూడా అతడే హీరో...?
14 Oct 2019, 7:37 PM
-
దేవదాస్ లాంటి కొడుకే పుట్టాలి....
21 Sep 2019, 4:55 PM
-
మల్టీస్టారర్ సినిమా కోసం ఇన్ని కత్తులా ?
20 Sep 2019, 1:04 PM
-
డీసెంట్ కలెక్షన్స్ తో గ్యాంగ్ లీడర్!!
16 Sep 2019, 3:39 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
రివ్యూ: రాగాల 24 గంటల్లో
22 Nov 2019, 5:34 PM
-
రివ్యూ: జార్జిరెడ్డి
22 Nov 2019, 2:57 PM
-
రివ్యూ: యాక్షన్
15 Nov 2019, 5:49 PM
-
రివ్యూ: ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’
15 Nov 2019, 4:34 PM
-
రివ్యూ: తిప్పరామీసం
08 Nov 2019, 4:08 PM
-
రివ్యూ: ఆవిరి
01 Nov 2019, 4:26 PM
-
రివ్యూ: మీకు మాత్రమే చెప్తా
01 Nov 2019, 3:39 PM
-
రివ్యూ: ఖైదీ
25 Oct 2019, 4:43 PM
-
రివ్యూ:విజిల్
25 Oct 2019, 3:43 PM
-
రివ్యూ: 'రాజుగారి గది 3'
18 Oct 2019, 5:31 PM
-
రివ్యూ: చాణక్య
05 Oct 2019, 4:46 PM
-
రివ్యూ: సైరా నరసింహారెడ్డి
02 Oct 2019, 12:44 PM
-
రివ్యూ: బందోబస్త్
20 Sep 2019, 4:40 PM
-
రివ్యూ: గద్దలకొండ గణేష్
20 Sep 2019, 4:16 PM
-
రివ్యూ: జోడి
06 Sep 2019, 5:18 PM
-
రివ్యూ: '2 అవర్స్ లవ్`
06 Sep 2019, 4:11 PM
-
రివ్యూ : సాహో
30 Aug 2019, 10:24 AM
-
రివ్యూ: ఏదైనా జరగొచ్చు
23 Aug 2019, 4:48 PM

హీరో నాని కార్యాలయంలో ఐటీ సోదాలు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.