(Local) Mon, 20 Sep, 2021

రివ్యూ: రాగాల 24 గంటల్లో

November 22, 2019,   5:34 PM IST
Share on:
రివ్యూ: రాగాల 24 గంటల్లో

విలక్షణ నటుడు సత్యదేవ్, ఈషా రెబ్బ హీరో హీరోయిన్లుగా శ్రీరాం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `రాగల 24 గంటల్లో`. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్‌పై ‘ఢమరుకం’ ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ చిత్రం ఎంత వరకు ప్రేక్షకులకు థ్రిల్ పంచిందో సమీక్షలో చూద్దాం….

కథ: ఒక అమ్మాయిని అత్యాచారం చేసిన కేసులో శిక్ష అనుభ‌విస్తున్న ముగ్గురు నేర‌స్థులు జైలు నుంచి త‌ప్పించుకుంటారు. వాళ్లని ప‌ట్టుకునేందుకు ఏసీపీ న‌ర‌సింహ (శ్రీరామ్‌) రంగంలోకి దిగుతాడు. రాహుల్ (సత్యదేవ్) ఫేమస్ ఫోటోగ్రాఫర్.  అనాధ అయిన విద్య (ఈషా రెబ్బ)తో రాహుల్ ప్రేమలో పడతాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఆ ముగ్గురు నిందితులు విద్య (ఈషారెబ్బా) ఇంట్లోకి చొర‌బ‌డ‌తారు. పోలీసులు వ‌స్తున్నార‌నే భ‌యంతో ఆ ఇంట్లో ఒక వార్డ్‌రోబ్‌లో దాక్కునేందుకు వెళ్లిన ఆ ముగ్గురికీ అందులో రాహుల్ శ‌వం క‌నిపిస్తుంది.  అయితే అనుకోని పరిస్థితుల్లో రాహుల్‌ హత్యకు గురవుతాడు. అది ఎవరు చేశారు? ఆ మిస్టరీని ఏసీపీ నరసింహం(శ్రీరామ్‌) చేధించాడా? విద్య, గణేశ్‌, అభిల మధ్య ఉన్న పరిచయం ఏంటి? ఈ మిస్టరీ కేసుకు​ దాస్‌(రవివర్మ) పుణీత్‌, వినీత్‌, అద్వైత్‌, మేఘన(ముస్కాన్‌ సేథీ)లకు ఏంటి సంబంధం? అనేదే మిగతా కథ. 

ప్లస్ పాయింట్స్: ప్రస్తుత కుర్ర హీరోలు కెరీర్‌ ఆరంభంలోనే నెగటీవ్‌ రోల్స్‌కూ సై అంటున్నారు. మొన్న కార్తికేయ.. నేడు స​త్యదేవ్‌. ఇప్పటివరకు సత్యదేవ్‌ను పాజిటివ్‌ యాంగిల్లోనే చూసిన అభిమానులు తొలిసారి విలన్‌గా చూస్తారు. సత్యదేవ్‌ నటన చూశాక సైకోయిజం, కన్నింగ్‌, అనుమానం ఇలా ఏదనుకున్న యాప్ట్‌ అవుతుంది. తొలిసారి నెగటీవ్‌ షేడ్‌లో కనిపించిన సత్యదేవ్‌ విలనిజంలో పూర్తిగా లీనమవుతాడు. ఈషా రెబ్బా యాక్టింగ్ సినిమాని మరో మెట్టు ఎక్కించాయి. కొంత గ్యాప్ తరువాత తెలుగు సినిమాలో కథకు కీలకమైన పోలీస్ అధికారి పాత్ర చేసిన హీరో శ్రీరామ్ తనదైన హావభావాలతో ఆకట్టుకుంటారు.మోడ‌ల్‌గా ముస్కాన్ సేథీ, ప‌క్కింటి అంకుల్‌గా కృష్ణ‌ భ‌గ‌వాన్, దాస్ పాత్రలో ర‌వివ‌ర్మ త‌దితరులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. ముగ్గురు నిందితులుగా న‌టించిన టెంప‌ర్ వంశీ, అజ‌య్‌, అనురాగ్‌ల పాత్రలు సినిమాకి కీల‌కం.  ప‌తాక స‌న్నివేశాలు సినిమాకి కీల‌కం. ఇందులో అస‌లు నిందితుడు ఎవ‌ర‌నేది చివ‌రి స‌న్నివేశాల్లో బ‌య‌టప‌డే విధానం మెప్పిస్తుంది.

మైనస్ పాయింట్స్: సినిమా ఆసాంతం ఆసక్తికరంగా సాగినప్పటికీ ప్రధానమైన మర్డర్ సన్నివేశంలో స్పష్టత లోపించింది. కొన్ని స‌న్నివేశాలు లెంగ్తీగా ఉండ‌డం మైన‌స్‌.

సాంకేతిక విభాగం: కామెడీ చిత్రాల‌పై మంచి ప‌ట్టుని ప్రద‌ర్శించిన దర్శకుడు  శ్రీనివాస‌రెడ్డి, ఒక  థ్రిల్లర్‌ను తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. కథనాలు నడిపిన విధానం సినిమాకు ప్రధానంగా ప్లస్ అయ్యింది. కెమెరామెన్‌ గరుడవేగ అంజి సినిమాను రిచ్‌ లుక్‌లో చూపించాడు. థ్రిల్లింగ్ సినిమాలకు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బలంగా ఉండాలి.  ఈ రెండు సినిమాకు ప్లస్ అయ్యాయి.  ఇక ఎడిటింగ్‌, నిర్మాణ విలువుల సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. 

తీర్పు: ఈవారం సినిమాలలో రాగల 24గంటల్లో తెలివైన ఎంపికే అని చెప్పుకోవచ్చు.

రేటింగ్: 3/5 

సంబంధిత వర్గం
రివ్యూ: అర్జున్ సుర‌వరం
రివ్యూ: అర్జున్ సుర‌వరం
రివ్యూ: జార్జిరెడ్డి
రివ్యూ: జార్జిరెడ్డి

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.