(Local) Sun, 31 May, 2020

రివ్యూ: ఎన్టీఆర్ - మ‌హానాయ‌కుడు

February 22, 2019,   11:22 AM IST
Share on:
రివ్యూ:  ఎన్టీఆర్ - మ‌హానాయ‌కుడు

మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ లో సెకెండ్ పార్ట్ ‘మహానాయకుడు’మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఒకసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం

క‌థ :ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చిత్రంలో ఎన్టీఆర్ సినీ పరిశ్రమలో ప్రవేశించడం, హీరోగా ఎదగడం, అభిమానుల్లో క్రేజ్ సంపాదించడం.. తెలుగు సినిమా తొలి సూప‌ర్ స్టార్‌గా దూసుకుపోతున్న‌ ఎన్టీఆర్ .. రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ప్రేరేపించిన ప‌రిస్థితులను క‌వర్ చేస్తూ రూపొందిన కథానాయకుడు చివ‌రికి పార్టీ పేరు ప్ర‌కటించ‌డంతో ఎండ్ కార్డ్ వేశారు. ఇక మ‌హానాయ‌కుడు క‌థ విష‌యానికి వ‌స్తే.. పార్టీ స్థాపించిన త‌ర్వాత ఎన్టీఆర్ ప్ర‌జ‌ల్లోకి ఏ విధంగా వెళ్ళారు.. ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ప్ర‌భంజ‌నంతో రికార్డు విజ‌యం ఎలా సొంత చేసుకున్నారు.. ప్ర‌జ‌ల‌కోసం ఎలాంటి సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టారు.. ఆ త‌ర్వాత పార్టీలోనూ, ప‌ర్ష‌న‌ల్ లైఫ్‌లోనూ ఎలాంటి స్ట్ర‌గుల్స్ ఫేస్ చేశారు అనేది తెలియాలంటే ఈ సినిమాని వెండితెర పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :ఎన్టీఆర్‌గా నంద‌మూరి బాల‌కృష్ణ ఒదిగిపోయిన విధానం ‘క‌థానాయకుడు’లో చూశాం. ఈ సినిమా దానికి కొన‌సాగింపు. ఎన్టీఆర్ గా మ‌రోసారి బాల‌కృష్ణ త‌న వంతు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశాడు. హావ భావాల ప్ర‌దర్శ‌న‌లో, సంభాష‌ణ‌లు ప‌లికే విధానంలోనూ స‌మ‌తూకం పాటించాడు. రాజ‌కీయ నాయ‌కుడిగా, భ‌ర్త‌గా ఆయ‌న పాత్ర‌లో రెండు పార్శ్వాలుంటాయి. రెండు చోట్లా.. బాల‌య్య రెండు ర‌కాలుగా క‌నిపిస్తాడు. విద్యాబాల‌న్ పాత్ర మొత్తం భావోద్వేగాల భ‌రితంగా సాగింది. ఆమె న‌ట‌న బ‌స‌వ‌తార‌కం పాత్ర‌కు మ‌రింత వ‌న్నె తెచ్చింది. చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో రానా న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. చంద్ర‌బాబు నాయుడు బాడీ లాంగ్వేజ్‌ని రానా పుణికి పుచ్చుకున్నాడు. కొన్ని ప‌దాల్ని చంద్ర‌బాబు ఎలా ప‌లుకుతారో మ‌నంద‌రికీ తెలుసు. రానా కూడా అదే విధానంతో ‘ముందుకు పోయాడు’. ఏఎన్నార్‌గా సుమంత్‌ని ఒకే ఒక్క స‌న్నివేశానికి ప‌రిమితం చేశారు. క‌ల్యాణ్ రామ్ కూడా అక్క‌డ‌క్క‌డ క‌నిపిస్తాడంతే.

మైనస్ పాయింట్స్ :క్రిష్ తన స్క్రీన్‌ప్లే తో అక్కటుకోలేకపోయాడు , కొన్ని సీన్స్ ఐతే రియాలిటీకి దూరంగా వున్నారు అనిపిస్తుంది ఎన్టీఆర్ చివ‌రి మ‌జిలీని విస్మ‌రించ‌డం అనేది ప్రధానంగా చెప్పుకోదగ్గది . 

సాంకేతిక వర్గం :క్రిష్ పాత్ర‌ల్ని మ‌ల‌చుకున్న విధానం బాగుంది. ఏది ఎంత వ‌ర‌కూ చెప్పాలో అంతే చెప్పాడు. మాట‌లు ఆక‌ట్టుకున్నాయి. ఆసుప‌త్రి ఎపిసోడ్ లో బుర్రా సాయిమాధ‌వ్ క‌లం మ‌రింత ప‌దునుగా ప‌లికింది. ఛాయాగ్ర‌హ‌ణం, నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటాయి. నిర్మాణ విలువ‌లూ బాగున్నాయి.

తీర్పు : బయోపిక్ కాబట్టి ఎలాంటి రెగ్యూలర్ కమర్షియల్ అంశాలు ఎక్స్ పెక్ట్ చెయ్యకూడదు. కానీ కమర్షియల్ అంశాలు మరియు ఓవర్ గా సినిమాటిక్ శైలిని ఎక్స్ పెక్ట్ చేసి వెళ్లితే మాత్రం నిరాశ తప్పదు.

రేటింగ్ : 2.5/5

 

 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.