(Local) Mon, 20 Jan, 2020

రివ్యూ : హిప్పీ

June 06, 2019,   5:58 PM IST
Share on:
రివ్యూ : హిప్పీ

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో హీరోగా పరిచయమైన కార్తికేయ తన రెండో చిత్రంగా చేసిన చిత్రం హిప్పీ . ఈ చిత్రాన్ని కళైపులి ఎస్ థాను వంటి స్టార్ ప్రొడ్యూసర్ నిర్మించారు.ఈ  హిప్పీ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :హిప్పీ దేవదాస్‌(కార్తికేయ) ఓ కిక్‌ బాక్సర్‌. తనకి స్నేహ(జెజ్‌బా సింగ్‌) లవ్‌ ప్రపోజ్‌ చేస్తుంది. తనతో దేవా డేటింగ్‌ చేస్తుంటాడు. ఓసారి స్నేహతో కలిసి గోవాకు వెళుతున్న సమయంలో ఆముక్త మాల్యద(దిగంగన సూర్యవన్షీ)ని చూసి ఇష్టపడతాడు.ఇక ఆమెను ప్రేమలో పడేయడానికి రకరకాల ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఆముక్తమాల్యద దేవ్ ప్రేమను అంగీకరిస్తోంది.  అయితే ఆముక్త తో ప్రేమాయణం అంత సాఫీగా సాగదు దాంతో ఆమెని వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు హిప్పీ . దాంతో అతడికి బుద్ది చెప్పడానికి ఆముక్త ఆడిన నాటకం ఏంటి ? చివరకు హిప్పీ – ఆముక్త ఒక్కటయ్యారా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :దిగంగాన సూర్యవంశీ తన పాత్ర పరిధి మేరకు బాగా నటించింది . నటనతోనే కాకుండా స్కిన్ షోతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది . అలాగే రొమాంటిక్ సీన్స్ లో కూడా రెచ్చిపోయింది ఆర్‌ఎక్స్‌ 100లో ఒకే ఎక్స్‌ప్రెషన్‌లో కనిపించిన కార్తికేయకు ఈ సినిమాలో వేరియేషన్స్‌ చూపించే అవకాశం దక్కింది. లుక్స్‌తో పాటు నటనపరంగానూ మంచి మార్కులు సాధించాడు. యాక్షన్‌ సీన్స్‌లో సూపర్బ్ అనిపించాడు. జజ్బా సింగ్ కు నటించే స్కోప్ లేదు . వెన్నెల కిషోర్ ఉన్నంత సేపు నవ్వించాడు . జెడి చక్రవర్తి తన పాత్రకు న్యాయం చేసాడు .

మైనస్ పాయింట్స్:కీలకమైన పాత్రలో నటించిన  జె.డి.చక్రవర్తి. నేను పెళ్లి చేసుకునే మెటీరియల్‌ కాదు అంటూ హీరో ప్రేమకు మాత్రం సలహాలు ఇస్తాడు. చివరకు క్లైమాక్స్‌లో పెళ్లి చేసుకుంటాడు. ఈ పాత్రను జె.డి.చక్రవర్తి ఎందుకు చేశాడో ఆయనే క్లారిటీ ఇవ్వాలి. సినిమాలో మెయిన్ పాయింట్ పర్వాలేదనిపించినా.. ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకోవు. అవసరానికి మించి మాస్ మసాలా సన్నివేశాలు ఎక్కువైపోయాయి. కొన్ని సన్నివేశాలకు అయితే సరైన ప్లో కూడా ఉండదు. పైగా సెకండాఫ్ కొంత ల్యాగ్ అనిపించి అక్కడక్కడ బోర్ కొడుతుంది.

సాంకేతిక విభాగం :ఆర్‌డీ రాజశేఖర్‌ సినిమాటోగ్రఫి బాగుంది. నివాస్‌ కే ప్రసన్నా సంగీతం పరవాలేదు. పాటలు విజువల్‌గా బాగున్నాయి. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. చాలా సన్నివేశాలు బోర్‌ ఫీలింగ్‌ కలిగిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

తీర్పు :ఇప్పటి యూత్‌ ఆలోచనలు ప్రేమ విషయంలో ఎలా ఉన్నాయనేదే సినిమా. రొమాంటిక్‌ సీన్స్‌, ఏరోటిక్‌ డైలాగ్స్‌తో సినిమాను తెరెక్కించారు. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

రేటింగ్ :2.25/5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.