(Local) Thu, 02 Jul, 2020

రివ్యూ : హుషారు

December 14, 2018,   4:13 PM IST
Share on:
రివ్యూ : హుషారు

‘ఉండిపోరాదే’ అనే సాంగ్ తో యువత దృష్టిని ఆకర్షించిన చిత్రం హుషారు. నూతన దర్శకుడు శ్రీ హర్ష కోనుగంటి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చింది మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

క‌థేంటంటే: ఆర్య (తేజ‌స్ కంచ‌ర్ల‌), చై (అభిన‌వ్), బంటి (తేజ్ కూర‌పాటి), ధ్రువ్ (దినేష్ తేజ్‌) చిన్న‌నాటి స్నేహితులు. పెద్ద‌య్యాక కూడా వాళ్ల స్నేహం కొన‌సాగుతుంది. న‌చ్చిన‌ట్టు జీవించాల‌నుకునే ఈ న‌లుగురూ అల్ల‌రి ప‌నులు చేస్తూ ఆడుతూ పాడుతూ స‌ర‌దాగా గ‌డుపుతుంటారు. ఆర్య... గీత (ద‌క్ష న‌గర్క‌ర్‌)ని, చై... రియా ( ప్రియ వ‌డ్ల‌మాని )ని ప్రేమిస్తారు. మిగ‌తా ఇద్ద‌రు కూడా తోడు కోసం ప్ర‌యత్నిస్తుంటారు. ఇంత‌లో చై ప్రేమ విఫ‌లం కావ‌డంతో పాటు... ఓ ప్ర‌మాదానికి గుర‌వుతాడు. ఆ త‌ర్వాత అత‌నికి క్యాన్స‌ర్ ఉంద‌నే విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంది. వైద్యానికి రూ. 30 ల‌క్ష‌లు ఖ‌ర్చ‌వుతుంద‌ని తెలిశాక మిగ‌తా స్నేహితులు ఎలా స్పందించారు? స్నేహితుడి ప్రాణాన్ని నిల‌బెట్ట‌డం కోసం, జీవితాల్లో నిల‌దొక్కుకోవ‌డం కోసం ఏం చేశారు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :సినిమాకు చై , ధృవ్ , ఆర్య , బంటీ పాత్రలు సినిమాకు మెయిన్ ప్లస్ అయ్యింది. ఆ పాత్రల్లో నటించిన వారు అందరు కొత్త వారైనా చాలా సహజంగా నటిస్తూ సినిమాకు హైలైట్ అయ్యారు. అలాగే రాహుల్ రామకృష్ణ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ గా నిలిచాడు. తన దైన కామెడీ టైమింగ్ తో సినిమాను నిలబెట్టేప్రయత్నం చేశాడు.

మైనస్ పాయింట్స్ :శ్రీ హర్ష రాసుకున్న కథ కొత్తదేమీ కాకపోవడంతో సినిమా అంత ఊహాజనితంగా వుంటూ ఆసక్తిని క్రియేట్ చేయలేకపోయింది. ఇక యూత్ ను టార్గెట్ చేసుకొని కథను నడిపించిన ఆయన దానికి తగ్గట్లు డబల్ మీనింగ్ డైలాగ్స్ రాసుకున్నాడు. యూత్ కు అవి నచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రం ఇబ్బందిలా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం :కథ పాతదే అయినా కథనంతో మ్యాజిక్ చేయాలని ప్రయత్నించిన దర్శకుడు ఆ ప్రయత్నంలో చాలా వరకు విజయం సాదించగలిగాడు. ఇక ఈ చిత్రానికి రాధన్ మ్యూజిక్ హైలైట్ అయ్యింది. ముఖ్యంగా ‘ఉండిపోరాదే’ సాంగ్ చాలా కాలం గుర్తిండిపోతుంది.ఇక సన్నీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు అలాగే రాజ్ తోట కెమెరా పనితనం ఆకట్టుకుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా కనిపించింది. విజయ్ వర్ధన్ ఎడిటింగ్ క్రిప్సీ గా వుంది. నిర్మాత బెక్కం వేణుగోపాల్ సినిమాకు అవసరమైనా మేర ఖర్చు పెట్టారు.

ఫైనల్ వర్దిక్ట్  :యూత్ ను టార్గెట్ చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రం టార్గెట్ ను పూర్తిగా చేరుకోలేకపోయింది, బలమైన ఎమోషనల్ సన్నివేశాలు లేకపోవడం, రొటీన్ కథ ఈ చిత్రంలో మైనస్ అయ్యాయి. చివరగా ఈ చిత్రం యూత్ కు నచ్చే ఛాన్స్ వుంది కానీ ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం కష్టమే.

రేటింగ్ : 2.5/5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.