(Local) Thu, 02 Jul, 2020

రివ్యూ :ఇదం జగత్

December 28, 2018,   7:45 PM IST
Share on:
రివ్యూ :ఇదం జగత్

సుమంత్ , అంజు కురియన్ జంటగా నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం తెరకెక్కించిన చిత్రం ‘ఇదం జగత్’. మరి ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..

కథ :రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం అనే జబ్బుతో బాధపడుతుంటాడు నిషిత్(సుమంత్). అందుకే రాత్రివేళ పనిచేసే జాబ్ చూసుకుంటాడు. అలా నైట్ రిపోర్టర్ గా మారిన హీరో, రాత్రిళ్లు జరిగే క్రైమ్ ఘటనల్ని కెమెరాతో షూట్ చేసి, ఛానెల్ కు అమ్మి డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో విలువలు, మానవత్వం మరిచిపోయి కేవలం డబ్బే లక్ష్యంగా పనిచేస్తుంటాడు.
ఒక రోజు అర్థరాత్రి రోడ్డుపై జరిగిన ఓ హత్యను షూట్ చేస్తాడు హీరో. అందులో కొంత భాగాన్ని మాత్రమే మీడియాకు అమ్ముతాడు. పోలీసులకు కూడా ఇవ్వడు. ఆరోజు రాత్రి చనిపోయిన వ్యక్తి మహతి (అంజు కురియన్) తండ్రి. అతడ్ని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అనే యాంగిల్ లో సుమంత్ వర్క్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తనకు దొరికిన ప్రతి ఆధారాన్ని మీడియాకు డబ్బుకు అమ్మేస్తుంటాడు.ఫైనల్ గా అదే కేసు సుమంత్ మెడకు చుట్టుకుంటుంది. విలన్లు ఏకంగా సుమంత్ తో పాటు అతడి స్నేహితుడు ఆనంద్ (సత్య)ను చంపాలని చూస్తారు. ఫైనల్ గా ఈ కేసు నుంచి సుమంత్ ఎలా బయటపడ్డాడు? హీరోయిన్ ప్రేమను ఎలా దక్కించుకున్నాడనేది స్టోరీ.

ప్లస్ పాయింట్స్ :నిషిత్ పాత్రలో నటించిన సుమంత్ ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. సవాలు తో కూడుకున్న పాత్ర కాకపోవడంతో పెద్దగా కష్టపడ్డట్లు అనిపించదు. హీరోయిన్ అంజు కురియన్ తన పాత్ర పరిధి మేర నటించింది. కాకపోతే గ్లామర్ పరంగా అంతగా మెప్పించలేకపోయింది. ఇక హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన సత్య అలాగే పోలీస్ ఆఫీసర్ గా నటించిన శివాజీ రాజా తమ పాత్రలకు న్యాయం చేశారు.ఇక నెగిటివ్ రోల్ లో నటించిన అర్జున్ రెడ్డి ఫేమ్ కళ్యాణ్ మంచి నటన కనబరిచాడు. తన ఆటిట్యూడ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.

మైనస్ పాయింట్స్ :దర్శకుడు అనిల్ ఇంట్రస్టింగ్ సబ్జెక్టు ను తెర మీదకు తీసుకురావడంలో కొన్నిచోట్ల తడబడ్డాడు. క్రైమ్ థ్రిల్లర్ అంటేనే ఆసక్తికర మలుపులు , ఉత్కంఠతో కూడిన స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తారు కాని ఈసినిమాలో అవి మిస్ అయ్యాయి. దాంతో సినిమా కొన్ని చోట్ల సాగదీసి నట్లుగా అనిపిస్తుంది.ఫస్ట్ హాఫ్ స్లో సాగుతూ ప్రేక్షకుడిని నీరసం తెప్పిస్తుంది. ఇంట్రస్టింగ్ పాయింట్ ఉన్న కథకు సరైన కథనం తోడైయితే సినిమా ఫలితం ఊహించినదానికంటే ఎక్కువగానే ఉంటుంది కానీ ఈ చిత్రం కథనం విషయం లో నిరాశపరచడంతో ఆ ప్రభావం సినిమా ఫలితం ఫై పడింది.

సాంకేతిక వర్గం:సినిమాకు పనిచేసిన ఏ ఒక్క టెక్నీషియన్ సరైన అవుట్ పుట్ ఇవ్వలేదు. బడ్జెట్ లిమిటేషన్స్ వల్ల అవుట్ పుట్ కూడా అలానే వచ్చింది. గతంలో మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన శ్రీచరణ్ పాకాల ఈసారి డిసప్పాయింట్ చేశాడు. గ్యారీ ఎడిటింగ్ అక్కడక్కడ బాగుంది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ విభాగాల్ని డీల్ చేసిన అనీల్ శ్రీకంఠం అంతగా మెప్పించలేకపోయాడు. ఇతడు సెలక్ట్ చేసుకున్న కాన్సెప్ట్ బాగుంది కానీ దాన్ని కథగా మలచడంలో తడబడ్డాడు. క్రైమ్ థ్రిల్లర్ కు ఉండాల్సిన ఆసక్తికరమైన ట్విస్టులు, సస్పెన్స్ ఈ సినిమాలో లోపించాయి. డైలాగ్స్ మరీ పేలవంగా ఉన్నాయి.

తీర్పు :క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ ఇదం జగత్ అనుకున్నంతగా థ్రిల్ చేయలేకపోయింది. సుమంత్ నటన , కథ ఈ సినిమాకు హైలైట్ అవ్వగా కథనం ,స్లో నరేషన్ , ఊహించిన ట్విస్ట్ లు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి. 

రేటింగ్  :2.75/5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.