(Local) Thu, 28 May, 2020

రివ్యూ : ‘జెర్సీ’

April 19, 2019,   1:19 PM IST
Share on:
రివ్యూ : ‘జెర్సీ’

సినిమా... సినిమాకు తన స్టార్ రేంజ్‌‌ను పెంచుకొంటూ వెళ్తున్న హీరోల్లో నాని ఒకరు. ఆయన తన  కెరీర్‌లో నటించిన చిత్రాలన్నీ దాదాపుగా మంచి విజయం అందుకున్నవే. గతేడాది ‘దేవదాస్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ఇప్పుడు ‘జెర్సీ’లో నటించారు. నాని జెర్సీతో రూట్ మార్చినట్టు కనిపించింది. టీజర్లు, ట్రైలర్లు అదే ఇంపాక్ట్‌ను కలిగించాయి. భావోద్వేగభరితమైన పాత్రలతో రూపొందిన జెర్సీ చిత్రం నానికి ఏ రేంజ్ విజయాన్ని అందించింది? బరువైన పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఆకట్టుకొన్నదా? గౌతమ్ తిన్ననూరి ద్వితీయ విఘ్నాన్ని అధిగమించారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే  ఈరోజు విడుదలైన ‘జెర్సీ’ చిత్రం ఏ మేర ఆకట్టుకుందో చూడాలి :

కథ : అర్జున్ ( నాని ) కి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం అయితే పెళ్లి అయ్యాక విధిలేని పరిస్థితిలో క్రికెట్ కు దూరం అవ్వాల్సి వస్తుంది . అయితే పదేళ్ల కాపురం తర్వాత మళ్ళీ క్రికెట్ పై అర్జున్ కు గాలి మళ్లుతుంది . వయసు మీద పడిన తర్వాత 30 ప్లస్ లో అర్జున్ మళ్ళీ క్రికెట్ గ్రౌండ్ లోకి ఎలా అడుగు పెట్టాడు ? అతడు అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

ప్లస్ పాయింట్స్:అర్జున్ పాత్రకు నాని మరోసారి తన సహజ నటనతో ప్రాణం పోశాడు . నాని కెరీర్ లోనే ఓ మైలురాయిగా జెర్సీ నిలిచిపోవడం ఖాయం అంతగా ఆకట్టుకున్నాడు తనదైన నటనతో . ఎమోషనల్ సీన్స్ లో అయితే నాని నటన పీక్స్ అనే చెప్పాలి . ఇక బెంగుళూర్ భామ శ్రద్దా శ్రీనాథ్ కూడా నాని ప్రేయసిగా , భార్యగా విభిన్న షేడ్స్ లో అద్భుతంగ రాణించింది . సహజంగానే థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో శ్రద్దా అద్భుతమనిపించింది . నాని కొడుకుగా నటించిన రోహిత్ కూడా చాలా బాగా నటించాడు . ఇక సీనియర్ నటుడు సత్యరాజ్ గురించి కొత్తగా చెప్పేదేముంది తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు.

మైనస్ పాయింట్స్ : సినిమా కు మెయిన్ మైనస్  సినిమా అక్కడడక్కడ స్లొయే అవ్వడమే. ఇక సెకండ్ హాఫ్ ను కూడా కొంచెం ట్రిమ్ చేస్తే బాగుండేది. ఇక ఈ చిత్రం పూర్తి ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కడం తో ఓ వర్గం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు. ఇక సినిమా పెద్దగా ట్విస్టులు లేకపోవడం ఊహాజనితంగా ఉండండం కూడా మైనస్ గా చెప్పొచ్చు.

సాంకేతిక విభాగం :టెక్నికల్ టీమ్ లో అద్భుతంగా రాణించింది అనిరుధ్ . ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ అందించిన నేపథ్య సంగీతం జెర్సీ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . పాటలు బాగున్నాయి అయితే అంతకంటే నేపథ్య సంగీతం తో అలరించాడు . షాను అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి . క్రికెట్ నేపథ్యంలో వచ్చే సీన్స్ ని మరింత అద్భుతంగా చిత్రీకరించాడు . నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి విషయానికి వస్తే ….. అక్కడక్కడా స్లో నెరేషన్ తో ఇబ్బంది పడినప్పటికీ తను చెప్పాల్సిన పాయింట్‌ ఎక్కడా మిస్‌ కాకుండా, సైడ్‌ ట్రాక్‌లను నమ్ముకోకుండా, నిజాయతీగా చెప్పే ప్రయత్నం చేశాడు. చక్కని ఎమోషనల్ సీన్స్ తో నటీనటుల నుండి తనకు రావాల్సిన నటనని రాబట్టుకొని జెర్సీ ని హత్తుకునేలా రూపొందించాడు .

తీర్పు :రెండున్నర గంటల పాటు ఒకే ఎమోషన్‌ చుట్టూ నడిచే సినిమా ‘జెర్సీ’నే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

రేటింగ్ :3.25 / 5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.