(Local) Thu, 28 May, 2020

రివ్యూ : ‘కాంచన 3’

April 19, 2019,   10:59 PM IST
Share on:
రివ్యూ : ‘కాంచన 3’

‘కాంచన’ సిరీస్ లతో వరుసగా హిట్లు కొట్టిన లారెన్స్ ఇప్పుడు ‘కాంచన 3’ సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. గత సినిమాల మాదిరిగా కాంచన 3 కూడా భయపెడుతూ, నవ్విస్తూ, హిట్ అందుకుందా .. లేక లారెన్స్‌కి షాకిచ్చిందా అనేది ఇప్పుడు చూద్దాం :

కథ :అమ్మమ్మ , తాతయ్యల షష్టిపూర్తి కోసం కుటుంబ సమేతంగా వరంగల్‌లోని తాతయ్య వాళ్లింటికొస్తాడు రాఘవ. అయితే అలావస్తున్న క్రమంలో అనుకోకుండా రెండు దెయ్యాలను వెంటపెట్టుకుని వస్తాడు. దాంతో ఆ ఇంట్లో రకరకాల భయంకర సంఘటనలు జరుగుతుంటాయి. భయపడిన వాళ్లింట్లో వాళ్లంతా కలిసి మునీశ్వర స్వామి గుళ్లోని అఘోరా దగ్గర కెళతారు. ఆ ఇంట్లో ఉన్న, రాఘవ ఒంట్లో ఉన్న కాళి, రోజీ అనే రెండు ప్రేతాత్మల గురించి చెప్తాడు. అసలు ఆ కాళి, రోజీలు ఎవరు..? ఎందుకు వారు ప్రేతాత్మలుగా మారారు? రాఘవని ఆవహించి ఎలా వాళ్లు పగతీర్చుకున్నారు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్:హార్రర్ కామెడీ సినిమాలకు పెట్టింది పేరైన లారెన్స్ మరోసారి తన నటనతో సినిమాకు హైలైట్ నిలిచాడు. రాఘవ , కాళి రెండు పాత్రలతో ఆకట్టుకున్నాడు. వేదిక నటన బాగుంది. ఒవియా , నిక్కి తంబోలి గ్లామర్ క్యారెక్టర్స్ తో ఎట్రాక్ట్ చేసారు. కోవై సరళ , శ్రీమాన్, దేవ దర్శిని మరోసారి కామెడీ పండించి బెస్ట్ అనిపించుకున్నారు. సూరి క్యారెక్టర్ చిన్నదే అయినా తన మార్క్ కామెడీతో అలరించాడు. అనుపమ కుమార్ క్యారెక్టర్ బాగుంది. కబీర్ సింగ్ విలనిజంతో పరవాలేదనిపించుకున్నాడు. మిగతా నటీ నటులంతా వారి పాత్రలకు న్యాయం చేసారు.

మైనస్ పాయింట్స్ : కథనంలో కొన్ని సీక్వెన్స్ లో ప్లో మిస్ అయింది. ఏ సీన్ కి ఆ సీన్ బాగుందినిపించినా, ఓవరాల్ గా కథలో మిళితమయ్యి ఉండవు.ఇకపోతే కథనం మరియు నేరేషన్ లో ఇంతకు ముందు వచ్చిన కాంచన 1, 2 పార్ట్స్ లో ఫాలో అయిన స్క్రీన్ ప్లే ఫార్మాట్ నే కాంచన 3లో కూడా ఫాలో అయ్యారు. దాంతో కొన్ని సీన్స్ ఇంతకు ముందు చూసినవే కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది.

సాంకేతిక విభాగం :హార్రర్ సినిమాలకు ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. ఆ విషయంలో తమన్ ను మెచ్చుకోవాలి. సినిమాకు సరైన నేపథ్య సంగీతం అందించాడు తమన్. సాంగ్స్ ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేస్తే బాగుండేది. సౌండింగ్ బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ సినిమాకు ప్లస్ అయ్యింది. 1400 మంది డాన్సర్స్ తో కోటి ఖర్చుతో షూట్ చేసిన సాంగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. సాంగ్స్ కి కోరియోగ్రఫీ బాగుంది. ఆర్ట్ డైరెక్టర్ తన వర్క్ తో సినిమాకు తగిన వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగాడు. లారెన్స్ రచయితగా, దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి.

తీర్పు :ఈ చిత్రం ప్యూర్ మాస్ ఎంటర్టైనర్. బి,సి సెంటర్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా సాగుతుంది. 

రేటింగ్ :2.75 / 5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.