(Local) Thu, 02 Jul, 2020

సమీక్ష : మిఠాయి

February 22, 2019,   2:06 PM IST
Share on:
సమీక్ష : మిఠాయి

నూతన దర్శకుడు ప్రశాంత్ కుమార్ ప్రముఖ కమెడియన్లు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా నటించిన డార్క్ కామెడీ సినిమా ‘మిఠాయి’. తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రెడ్ యాంట్స్ పతాకంపై డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు.  ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం :..

క‌థ‌: సాయి(రాహుల్ రామ‌కృష్ణ‌) ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. రెగ్యుల‌ర్‌గా ఉద్యోగానికి వెళ్లి డ‌బ్బులు సంపాదించాల‌ని కాకుండా ఏదో ఒక‌టి కొత్త‌గా చేసి డ‌బ్బులు సాధించాల‌నుకునే సాయికి జానీ(ప్రియ‌ద‌ర్శి) ప్రాణ స్నేహితుడు. ఇద్ద‌రికీ బాగా బ‌ద్ద‌కం. ఇద్ద‌రూ బ‌లాదూర్‌గా తిరిగే ర‌కాలు. గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను సాయి పెళ్లి చేసుకోవాల‌నుకుంటూ ఉంటాడు. పెళ్లి కోసం గ‌ర్ల్‌ఫ్రెండ్‌కి ఓ చైన్‌ను త‌యారు చేయిస్తాడు. అయితే ఓరోజు ఎవ‌రో సాయి ఇంట్లోకి ప్ర‌వేశించి చైన్‌తో పాటు టీవీ ల్యాప్ టాప్‌ను దొంగిలించి తీసుకెళ‌తారు. ఆ దొంగ‌ను ప‌ట్టుకునే వర‌కు పెళ్లి చేసుకోన‌ని సాయి శ‌ప‌థం చేస్తాడు. దానికి జానీ కూడా తోడుగా వ‌స్తాడు. దొంగ‌ల‌ను వెతుకుతూ ఇద్ద‌రూ వెళ్లే క్ర‌మంలో వారికి ఎదురైన ప‌రిస్థితులేంటి? చివ‌ర‌కు సాయి పెళ్లి జ‌రిగిందా? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలే ఈ సినిమాకు ప్రధాన బలం. సినిమాలో అక్కడక్కడ కొన్ని కామెడీ ఎలిమెంట్స్ పర్వాలేదని అనిపించాయంటే.. దానికి రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటనే కారణం. తమ పాత్రలకు తగ్గట్లు… తమ రియలిస్టిక్ యాక్టింగ్ తో మాడ్యులేషన్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచారు.అలాగే కమల్ కామరాజు ట్రాక్ కూడా సినిమాలో కొంత ఇంట్రస్ట్ ను పెంచడానికి ఉపయోగపడింది. ఇక ఈ సినిమాలో తానూ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి అసలు నిజం తెలిసే సన్నివేశంలో రాహుల్ రామకృష్ణ నటన చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో నటించిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :సినిమా అంతా ఎంత డ్రాగింగ్‌గా సాగుతుందో, అంత డ్రాగింగ్‌గా సాగుతుంది. ఇత‌ర న‌టీన‌టుల గురించి పెద్ద‌గా తెలియ‌దు. డైరెక్ట‌ర్ ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్లిపోయారు. దాన్ని చూస్తే న‌వ్వు రాదు క‌దా.. ఏడుపు రావ‌డం ఒక‌టే త‌క్కువే. డార్క్ కామెడీ అంటే ఇలా ఉంటుందా? అనే భావ‌న ప్రేక్ష‌కుడికి ఓ ర‌క‌మైన భ‌యాన్ని క‌ల్గిస్తుంది. ఎవ‌రైనా డార్క్ కామెడీ అంటే ఈ సినిమా గుర్తుకొచ్చి జ‌డుసుకునేంత‌లా. మెయిన్ ప్లాట్ బాగానే లేదు. స‌రేలే లైన్ నార్మ‌ల్‌గా ఉంద‌నుకున్నా.. స‌న్నివేశాలేమైనా, ఆస‌క్తిక‌రంగా, బ‌లంగా ఉన్నాయా? అవీ లేవు. 

సాంకేతిక విభాగం :సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది.ఇక ఎడిటింగ్ బాగుంది గాని, సెకండాఫ్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఇక నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.

తీర్పు :ఓవరాల్ గా సినిమా మాత్రం స్లోగా సాగుతూ బాగా బోర్ కొట్టిస్తుంది. పైగా సెకండాఫ్ లో సాగతీత సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. మొత్తం మీద ఈ ‘మిఠాయి’ బాగా నిరాశ పరుస్తోంది.

రేటింగ్ :1.5/5

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.