(Local) Thu, 02 Jul, 2020

రివ్యూ: 'యాత్ర'

February 08, 2019,   8:33 PM IST
Share on:
రివ్యూ:  'యాత్ర'

దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో దర్శకుడు మహి.వి.రాఘవ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్టుట్టి నటించారు. ప్రపంచ వ్యాప్తంగా 970 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం. 

కథ :    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పరిపాలనతో రాష్ట్రంలో రైతుల స్థితు గతులు  ఎలా ఉన్నాయనే దానిపై ఈ సినిమా స్టోరీ మొదలైవుతుంది. రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, ప్రజల కష్టాలను చూసి చలించి పోయి వైయస్ఆర్ పాద యాత్రకు పూనుకుంటాడు. ఈ సందర్భంగా ప్రజల్లోకి వెళ్లి వాళ్ల కష్టసుఖాలను తెలుసుకుంటాడు. పాద యాత్ర తర్వాత వైయస్ఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ సందర్భంగా ఆయన ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఆరోగ్య శ్రీ, ఫీజ్ రిఎంబర్స్‌మెంట్, ఆయనకు ఎలా పేరు తీసుకొచ్చాయి. తిరిగి రెండోసారి సీఎం అవ్వడం..హెలికాప్టర్ ప్రమాదంలో ఎలా కన్నుమూసాడనేదే ‘యాత్ర’ స్టోరీ.

ప్లస్ పాయింట్స్ : యాత్ర’ సినిమాలో వైయస్.రాజశేఖర్ రెడ్డి పాత్రకు మమ్ముట్టి కాకుండా..వేరే నటుడిని ఊహించుకోవడం కష్టం అనే రేంజ్‌లో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడా అనే రీతిలో నటించి మెప్పించాడు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి హావభావాలు, మొండితనన్ని తన నటనతో మెప్పించాడు. ముఖ్యంగా పార్టీ అధిష్టానం కంటే అన్ని తానై పార్టీని ముందుకు నడిపించడంలో ఆయన మొండితనం ఎలా ఉండదో మమ్ముట్టి తన నటనతో చూపించాడు. ముఖ్యంగా యాత్ర సందర్భంగా రైతుల కష్టాలు, కరెంట్ సమస్యలపై చలించపోవడం వంటి ఎమోషనల్ సన్నివేశాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా  నటీనటుల విషయానికొస్తే వైయస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు కాసేపు ఉన్న పర్వాలేదనిపించాడు. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు ఉన్నంతలో పర్వాలేదనపించారు.

మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ దర్శకుడు మాత్రం వాటిని సింపుల్ గా నడిపారు.మంచి ఎమోషనల్ గా సినిమాని నడిపిన మహి, అక్కడక్కడ కొన్ని సీన్స్ లో ఆ ఎమోషన్ని ఆ స్థాయిలోనే కంటిన్యూ చేయలేక పోయాడు. పైగా ఓవర్ గా సినిమాటిక్ శైలిని ఎక్స్ పెక్ట్ చేసి వెళ్లితే మాత్రం నిరాశ తప్పదు. ఇక ఎలాంటి రెగ్యూలర్ కమర్షియల్ అంశాలు పెట్టకుండా దర్శకుడు తను అనుకున్న ఎమోషనల్ డ్రామానే ఎలివేట్ చేయటానికే ఆసక్తి చూపారు.

సాంకేతిక విభాగం : స్టోరీ, కటెంట్  పరంగా బాగున్నా...ఈ సినిమా నేరేషన్ మాత్రం చాలా స్లాగా సాగడం మైనస్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. మొత్తంగా క్లైమాక్స్‌లో వైయస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన విజువల్స్‌ను నిజంగానే చూపించి ప్రేక్షకులను ఎమోషన్ గురిచేసారు.

తీర్పు : మొత్తం మీద ఈ చిత్రం వైఎస్సార్ అభిమానులకు మాత్రం ఎప్పటికీ గుర్తు ఉండిపోతుంది. అలాగే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని కూడా ఈ చిత్రం అలరిస్తుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో ఈ చిత్రం నిలబడుతుందో చూడాలి.

రేటింగ్ : 3.5/5

 

 

 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.