
‘ప్రస్థానం’తో నటుడిగా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన సందీప్ కిషన్, హిట్ ప్లాప్ తో సంబధం లేకుండా పలు విభిన్న చిత్రాలతో నటిస్తూ ప్రేక్షుకులను మెప్పిస్తున్నాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత సరైన సక్సెస్ లేని సందీప్ కిషన్.. ఈ మధ్యనే ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో పర్వాలేదనపించాడు. తాజాగా ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ నిర్మాణంలో జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమాతో పలకరించాడు. హీరో సందీప్ కిషన్ లాయర్‌గా నటిస్తున్న ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ అని ఇందులో సందీప్ కి జంటగా హన్సిక, మోత్వాని జత కట్టింది. అయితే, విడుదలకు ముందు ఈ సినిమా మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తుందని సినిమా యూనిట్ చెప్పుకొచ్చింది. మరి ఆ అంచనాలను ఆయన నిజం చేశారా? సందీప్ కిషన్ హాస్య ప్రధానమైన కథ, పాత్రల్లో కనిపించి ఎలాంటి ప్రభావం చూపించారు? లాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే....
కథ: సరైన కేసులు రాక ఆదాయం లేక కోర్టులో పెండింగ్ లో ఉన్న సివిల్ కేసులను తన తెలివితేటలతో బయట సెటిల్మెంట్లు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు కర్నూల్ కి చెందిన తెనాలి రామకృష్ణ(సందీప్ కిషన్). ఏదైనా కేసు పట్టాలని చెప్పి ఆఫర్లు కూడా ప్రకటిస్తాడు. అయినా ప్రయోజనం ఉండదు. ఎన్ని ఆఫర్లు ఇచ్చినా తన దగ్గరికి కేసులు రావు. తన తండ్రి దుర్గారావు (రఘుబాబు) మాత్రం కొడుకు ఒక పెద్ద కేసు వాదించి గెలిస్తే చూడాలని ఆశపడుతుంటాడు. ఇదే సమయంలో కర్నూలు సిటీలో సింహాద్రి నాయుడు ( అయ్యప్ప శర్మ) రౌడీగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. కోట్లు సంపాదిస్తాడు. రాజకీయాల్లోనూ తన పవర్ చూపించాలనుకుంటాడు. కర్నూలులో వరలక్ష్మి (వరలక్ష్మీ శరత్ కుమార్) పారిశ్రామికవేత్తగా ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు సంపాదిస్తుంది. రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఉద్దేశంతో ఆమె మచ్చ లేకుండా మంచి పనులు చేస్తూ ఉంటుంది. ఈ తరుణంలో కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఓ జర్నలిస్ట్ హత్య జరుగుతుంది. అయితే ఈ హత్య వరలక్ష్మి చేయించిందని ఆమె ప్రత్యర్ధి..హత్యారాజకీయాలు..బెదిరింపులకు పాల్పడుతుంటే అయ్యప్పశర్మ హంగామా చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్ట్ హత్య కేసులో వరలక్ష్మి ని ఇరికిస్తాడు..ఆ తర్వాత ఏం జరుగుతుంది..ఈ హత్య కు తెనాలికి సంబంధం ఏంటి..? ఈ కేసు నుండి వరలక్ష్మి ఎలా బయటపడుతుంది..? తెనాలి కి ఓ లాయర్ గా ఎలా గుర్తింపు వస్తుంది..? రుక్మిణి (హన్సిక)తో తెనాలి ప్రేమాయణం ఎక్కడిదాకా వెళ్లింది? అనేది అసలు కథ.
ప్లస్ పాయింట్స్: మొదటి సగంలో కేసులు లేని కొత్త లాయర్ గా సందీప్ కిషన్ మరియు తోటి లాయర్ గా చేసిన ప్రభాస్ శ్రీను చక్కగా నవ్వించారు. హన్సిక పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటల్లో మాత్రం అందంగా కనిపించింది. మొదటి సగంలో సందీప్, హన్సికల రొమాంటిక్ ఎపిసోడ్ ఆహ్లాదంగా సాగింది. వరలక్ష్మీ శరత్‌కుమార్ నటన హైలెట్‌గా నిలుస్తుంది. ప్రభాస్ శ్రీను, సప్తగిరి, వెన్నెల కిషోర్, అన్నపూర్ణమ్మ, వై.విజయ, రఘుబాబు, సత్యకృష్ణ, అనంత్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి నవ్వించారు. విరామ సమయంలో వరలక్ష్మి పాత్ర ప్రవేశంతో అసలు కథ మొదలవుతుంది. ద్వితీయార్ధంలో కోర్టు రూమ్ డ్రామా, మలుపులు కాస్త ఆసక్తిని రేకెత్తిస్తాయి. తన శైలిలోనే కామెడీ చిత్రంగా తెనాలి రామకృష్ణను మలచడంలో దర్శకుడు నాగేశ్వరరెడ్డి కొంతవరకు విజయవంతమయ్యారు.
మైనస్ పాయింట్స్: కామెడీ చిత్రాలకు కేరాఫ్ అయినా నాగేశ్వర రెడ్డి..ఈ చిత్ర కథ – కథనం విషయంలో కాస్త తడపడినట్లు తెలుస్తుది. వరలక్ష్మీ, అయ్యప్ప శర్మ లాంటి ఇంటెన్స్ యాక్టర్స్ ఉన్నా వాళ్లను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు దర్శకుడు. విఫలమయ్యారు. స్క్రీన్ ప్లే స్లోగా నడపడంతో సినిమా చాలా చోట్ల బోరు కొడుతోంది. చమ్మక్ చంద్ర కామెడీ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. సాయి కార్తీక్ అందించిన పాటలలో 'కర్నూల్ కత్తివా' అనే పాట తప్ప మిగిలిన పాటలను మరచిపోవడం అంత మంచిది. సక్సెస్ఫుల్ సినిమాగా నిలబెట్టగల బలమైన కథ, కథనాలు సినిమాలో లోపించడంతో తెనాలి రామకృష్ణ యావరేజ్ స్థాయిలోనే నిలిచింది. క్లైమాక్స్ మాత్రం సాదాసీదాగా పూర్తి చేసాడు.
సాంకేతిక విభాగం: కామెడీ చిత్రాలకు కేరాఫ్ అయినా నాగేశ్వర రెడ్డి..ఈ చిత్ర కథ – కథనం విషయంలో కాస్త తడపడినట్లు తెలుస్తుది.సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్ సీన్స్‌లో పిక్చరైజేషన్ ఆకట్టుకుంటుంది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ కు తగ్గట్లుగా ఉంది. సాయి శ్రీరామ్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. నివాస్, భవానీ ప్రసాద్ సంభాషణలు అక్కడక్కడా మెప్పించినా ద్వంద్వార్థాలు ఎక్కువగా వినిపిస్తాయి.ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెడితే బాగుండు.
తీర్పు: తెనాలి రామకృష్ణ బిఎ, బిఎల్....ఏ సెక్షన్ కిందకి రాదు....
రేటింగ్: 2.5/5
-
ఉదయ్ కిరణ్ బయోపిక్.. స్పందించిన సందీప్
27 Nov 2019, 6:13 PM
-
వరలక్ష్మి పాత్ర కూడా తేలిపోయింది...
18 Nov 2019, 9:44 PM
-
సందీప్ కిషన్ హీరోగా `A1 ఎక్స్‌ప్రెస్` ప్రారంభం.. ...
04 Nov 2019, 3:34 PM
-
నవంబర్ 15 న వస్తున్న 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్'
04 Nov 2019, 2:45 PM
-
హన్సిక సినిమాలో శ్రీశాంత్ విలన్...
13 Oct 2019, 11:35 PM
-
‘తెనాలి రామకృష్ణ B.A, B.L’ టీజర్.....
15 Sep 2019, 9:58 PM
-
రివ్యూ : సాహో
30 Aug 2019, 10:24 AM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
రివ్యూ: రాగాల 24 గంటల్లో
22 Nov 2019, 5:34 PM
-
రివ్యూ: జార్జిరెడ్డి
22 Nov 2019, 2:57 PM
-
రివ్యూ: యాక్షన్
15 Nov 2019, 5:49 PM
-
రివ్యూ: తిప్పరామీసం
08 Nov 2019, 4:08 PM
-
రివ్యూ: ఆవిరి
01 Nov 2019, 4:26 PM
-
రివ్యూ: మీకు మాత్రమే చెప్తా
01 Nov 2019, 3:39 PM
-
రివ్యూ: ఖైదీ
25 Oct 2019, 4:43 PM
-
రివ్యూ:విజిల్
25 Oct 2019, 3:43 PM
-
రివ్యూ: 'రాజుగారి గది 3'
18 Oct 2019, 5:31 PM
-
రివ్యూ: చాణక్య
05 Oct 2019, 4:46 PM
-
రివ్యూ: సైరా నరసింహారెడ్డి
02 Oct 2019, 12:44 PM
-
రివ్యూ: బందోబస్త్
20 Sep 2019, 4:40 PM
-
రివ్యూ: గద్దలకొండ గణేష్
20 Sep 2019, 4:16 PM
-
రివ్యూ: గ్యాంగ్ లీడర్...
13 Sep 2019, 4:27 PM
-
రివ్యూ: జోడి
06 Sep 2019, 5:18 PM
-
రివ్యూ: '2 అవర్స్ లవ్`
06 Sep 2019, 4:11 PM
-
రివ్యూ : సాహో
30 Aug 2019, 10:24 AM
-
రివ్యూ: ఏదైనా జరగొచ్చు
23 Aug 2019, 4:48 PM

ఉదయ్ కిరణ్ బయోపిక్.. స్పందించిన సందీప్

సందీప్ కిషన్ హీరోగా `A1 ఎక్స్‌ప్రెస్` ప్రారంభం.. ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.