(Local) Sat, 23 Oct, 2021

రివ్యూ: యాక్షన్

November 15, 2019,   5:49 PM IST
Share on:
రివ్యూ: యాక్షన్

కోలీవుడ్ స్టార్ అయినప్పటికీ హీరో విశాల్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే హీరో విశాల్ తన తమిళ్ చిత్రాలను డబ్ చేసి తెలుగులో కూడా విడుదలచేస్తుంటాడు. తాజాగా ఈ యాక్షన్ హీరో విశాల్‌ కథానాయకుడిగా, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యాక్షన్’‌. సుందర్‌ సి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అటు తమిళంతో పాటు, ఇటు తెలుగులోనూ మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. కాగా ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ : సుభాష్(విశాల్‌) ఓ మిల‌ట‌రీ క‌మాండ‌ర్. నాన్న ముఖ్యమంత్రి. అన్నయ్య ఉప ముఖ్యమంత్రి. సుభాష్‌ మ‌ర‌ద‌ల్ని పెళ్లి చేసుకుందామ‌నుకుంటాడు. ఈ సందర్భంగా జరిగే ఒక మీటింగ్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగి సుభాష్ తన ఫ్యామిలీలో చాలా మందిని పోగొట్టుకుంటాడు. ఈ బ్లాస్టింగ్ కి కారణం సుభాష్ కుటుంబమే అనే ఆరోపణలు బలంగా వినిపిస్తాయి. ఇది తట్టుకోలేక సుభాష్ అన్నయ్య (రాంకీ) ఆత్మహత్య చేసుకుంటాడు. అసలు ఆ బ్లాస్టింగ్ ఎందుకు జరిగింది..? సుభాష్ ఆ బ్లాస్టింగ్ కారకులను పట్టుకున్నాడా? ఈ క్రమంలో సుభాష్ కు తమన్నా ఎలాంటి సాయం చేసింది? ఇవి తెలియాలంటే యాక్షన్ సినిమా చూసి తీరాల్సిందే. 

ప్లస్ పాయింట్స్ : పేరుకు త‌గ్గట్టు సంపూర్ణమైన యాక్షన్ చిత్రమిది.  సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ స్ చూస్తున్నంతసేపూ ఓ హాలీవుడ్ యాక్షన్ మూవీని చూస్తున్న ఫీల్ కలుగుతుంది.  విశాల్‌కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. ఓ సైనికుడిగా, ఓ తండ్రికి కొడుకుగా, ప్రియుడిగా.. త‌న ల‌క్ష్యాన్ని నెర‌వేర్చే పాత్రలో ఒదిగిపోయారు. త‌మ‌న్నాకు ఇది కొత్త త‌రహా పాత్ర. ప్రథమార్ధంలో చాలా త‌క్కువే క‌నిపించినా, ద్వితీయార్ధంలో ఆ లోటు తీర్చింది. ఆమె నటన ఆకట్టుకుంటుంది. మరో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ కూడా కనిపించిన ఆ కొన్ని లవ్ సీన్స్ లో కూడా చాల క్యూట్ గా బాగా నటించింది. ఇక సినిమాలో కీలక మైన పాత్రలో నటించిన రాంకీ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఆకాంక్షా పూరి గ్లామ‌ర‌స్‌గా క‌నిపించారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. సాయాజీ షిండే తన పాత్రను సమర్ధవంతంగా పోషించాడు. మిగతా వారంతా కూడా తమ పాత్ర పరిధుల మేరకు మంచి ఔట్పుట్ ఇచ్చారు.

మైనస్ పాయింట్స్ : స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు అక్కడక్కడ తడబడ్డాడు. యాక్షన్ సీన్స్ హైలెట్ గా తీసినా కూడా యాక్షన్ లో టెంపోని మిస్ చేస్కున్నాడు.దర్శకుడు ఫస్టాఫ్ ను ఆసక్తికరమైన యాక్షన్ తో నడిపినా.. ఆసక్తికరంగా సాగని సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ను బోర్ గా నడిపారు. సినిమాలో క‌థ త‌క్కువ అవ్వ‌డం యాక్ష‌న్ ఎక్కువ అవ్వ‌డం కూడా మైన‌స్‌. స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు అక్కడక్కడ తడబడ్డాడు. సెకండాఫ్ కొన్ని సీన్స్ సాగదీసినట్లు అనిపించాయి.

సాంకేతిక విభాగం : యాక్షన్ సినిమాలో ముందుగా అందరూ నోటీసు చేసేది నిర్మాణ విలువల గురించే. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కిన ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ ప‌రంగా బాగా ఖర్చు పెట్టారు. ప్రతీ పైసా తెర‌పై క‌నిపిస్తుంది. కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటాయి.  సంగీత దర్శకుడు హిప్‌హాప్‌ తమీజా మరోసారి బ్యాగ్రౌండ్ స్కోర్ చించేసాడు కానీ పాటలు మాత్రం బాగోలేవు. యాక్షన్ పొడుగు ఎక్కువైపోయింది. ట్రీమ్ చేసి ఉంటే.. బాగుండేదేమో అనిపించింది.

తీర్పు : యాక్షన్ చిత్రాన్ని యాక్షన్ జోనర్ ను ఇష్టపడే ప్రేక్షకులు ఒకసారి చూడవచ్చు.

రేటింగ్‌: 3 / 5

సంబంధిత వర్గం
విశాల్ ‘చక్ర’ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్...
విశాల్ ‘చక్ర’ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.