(Local) Sun, 17 Nov, 2019

రెండో టీ20లో భారత్ ఘన విజయం

November 08, 2019,   2:21 PM IST
Share on:
రెండో టీ20లో భారత్ ఘన విజయం

రాజ్ కోట్ లో బంగ్లాదేశ్ తో గురువారం జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ 154 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి సాధించింది. దీంతో 3 మ్యాచ్ ల సిరీస్ లో 1-1 తో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి.అంతకముందు టాస్ ఓడి రెండో టీ20లో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు మంచి ఆరంభం లభించింది. లిటన్ దాస్, మహ్మద్ నైమ్‌ల జోడీ తొలి వికెట్‌కి 60 పరుగులు జోడించారు. ఆ తర్వాత చాహల్ బౌలింగ్‌లో లిటన్ దాస్ పెవిలియన్‌కు చేరాడు.ఆ తర్వాత కొద్ది సేపటికే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో నయిమ్(36) శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తొలి టీ20లో హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ముష్ఫికర్ రహిమ్(4) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు.చివర్లో సౌమ్య సర్కార్(30), కెప్టెన్ మహ్మదుల్లా(30) ఫరవాలేదనిపించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. భారత బౌలర్లలో యజువేంద్ర చాహల్ రెండు వికెట్లు తీయగా... వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మాద్, దీపక్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు.154 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 85, శ్రేయాస్ అయ్యార్ 26, శిఖర్ ధావన్ 31, కేఎల్ రాహుల్ 8 పరుగులు చేేేశారు. మూడో టీ20 నవంబర్ 10న నాగ్ పూర్ లో జరగనుంది.

సంబంధిత వర్గం
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్ ...
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.