(Local) Thu, 18 Jul, 2019

ఆసీస్ ప్లేయర్ల డెడికేషన్ లెవెల్ చూపించిన అలెక్స్ క్యారీ

July 11, 2019,   11:01 PM IST
Share on:

ఆస్ట్రేలియా క్రికెటర్లకు వరల్డ్‌కప్ అంటే ఎంతో మోజు. టీ20, టెస్టుల్లో ఎలా ఆడినా  వన్డే ప్రపంచకప్ సమరంలో మాత్రం కంగారూలు ఏం చేయడానికైనా సిద్ధపడిపోతారు. వచ్చే వరల్డ్‌కప్ గురించి ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక వేస్తారని ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌పై ఓ చలోక్తి కూడా ఉంది. మరోసారి ఆసీస్ ప్లేయర్లకు ఉండే డెడికేషన్ లెవెల్ ఏంటో నిరూపించాడు అలెక్స్ క్యారీ. 14 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్‌ను అలెక్స్ క్యారీ, స్టీవ్ స్మిత్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జోఫ్రా ఆర్చర్ వేసిన ఓ బౌన్సర్ నేరుగా వచ్చి క్యారీ హెల్మెట్‌కు తగిలింది. ఆ వేగానికి హెల్మెట్ ఊడి, బయటికి రాగా... క్యారీ దవడకు గాయమైంది. రక్తం కారుతుండడంతో వెంటనే ఫిజియోను పిలిచిన ఆలెక్స్ క్యారీ... తల చుట్టూ బ్యాండేజ్ వేసుకుని బ్యాటింగ్ కొనసాగించాడు. అలెక్స్ క్యారీ సమయస్ఫూర్తితో వ్యవహారించి హెల్మెన్‌ను పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే హెల్మెట్ వికెట్ల మీద పడితే, అతను హిట్ వికెట్‌గా అవుటయ్యేవాడు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.