(Local) Thu, 28 May, 2020

హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన అంబటి రాయుడు

September 14, 2019,   12:07 PM IST
Share on:
హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా  ఎంపికైన అంబటి రాయుడ ...

ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు, ఆపై అనూహ్యంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే అంబటి రాయుడు హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 24 నుంచి వచ్చే అక్టోబర్ 11 వరకు బెంగళూరులో జరగనున్న విజయ్ హజారే టోర్నీ కోసం హైదరాబాద్ జట్టును ప్రకటించిన సెలక్టర్లు అంబటికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.బి.సందీప్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. అంతర్జాతీయ క్రికెట్‌‌కు ప్రకటించిన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు రాయుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు లేఖ రాశాడు. సెలక్షన్‌కు తాను అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ నేపథ్యంలో అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న అసోసియేషన్ రాయుడికి ఏకంగా జట్టు కెప్టెన్ పగ్గాలు అప్పగించడం గమనార్హం.

సంబంధిత వర్గం
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
అంబటి రాయుడు రిటైర్మెంట్‌పై నెటిజన్లు వ్యంగ్యాస్త్ ...
అంబటి రాయుడు రిటైర్మెంట్‌పై నెటిజన్లు వ్యంగ్యాస్త్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.