(Local) Mon, 20 May, 2019

సియట్‌ క్రికెట్‌ రేటింగ్‌ అవార్డులు

May 14, 2019,   2:25 PM IST
Share on:

సోమవారం జరిగిన సియట్ అంతర్జాతీయ క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్నాథ్‌కు లైఫ్‌టైమ్ అవీచ్‌మెంట్ అవార్డు దక్కింది.1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో మొహిందర్ అమర్నాథ్‌ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో ఆర్సీబీ పేలవ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో ఈ అవార్డు రావడం కోహ్లీకి కాస్త ఉత్సాహానిస్తుంది.

కాగా, 2018లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్లేయర్‌గా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు ఐసీసీ పురుషుల టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ వన్డే ప్లేయర్ అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక, స్మృతి మంధానకు అంతర్జాతీయ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది.మంధాన విషయానికి వస్తే ఈ ఏడాది ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు ఉమెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. 2018లో మంధాన 12 వన్డేలాడి 66.90 యావరేజితో 669 పరుగులు చేసింది. 25 టీ20లాడి 130.67 యావరేజితో 622 పరుగులు నమోదు చేసింది.

సియట్ అంతర్జాతీయ క్రికెట్ అవార్డులు:

లైఫ్‌టైమ్ అవీచ్‌మెంట్ అవార్డు - Mohinder Amarnath
అంతర్జాతీయ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ - Virat Kohli
అంతర్జాతీయ్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ - Jasprit Bumrah
అంతర్జాతీయ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - Cheteshwar Pujara
అంతర్జాతీయ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - Rohit Sharma
అంతర్జాతీయ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ - Aaron Finch
అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాడు - Kuldeep Yadav
అంతర్జాతీయ టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ - Rashid Khan
డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ - Ashutosh Aman
అంతర్జాతీయ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - Smriti Mandhana
జూనియర్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - Yashasvi Jaiswal
క్రికెట్ జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్ - Sriram Veera and Snehal Pradhan
స్పెషల్ ట్రిబ్యూట్: Late Ajit Wadekar

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.