(Local) Tue, 21 May, 2019

భారత్‌, పాకిస్థాన్‌ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలి - అఫ్రిది

May 11, 2019,   1:05 PM IST
Share on:

కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిదీ అఫ్రిది అన్నారు . రెండు దేశాల మధ్య      విద్వేషాలను తగ్గించేందుకు క్రికెట్‌ మంచి మార్గం. అందుకే భారత్‌, పాకిస్థాన్‌ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలి. అలా అయితేనే రెండు దేశాల ప్రజల  మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి’ అని అఫ్రిది పేర్కొన్నాడు.2004లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు వచ్చిన అభిమానులను పాక్‌ ప్రజలు ఎంతో ప్రేమతో చూసుకున్నారని గుర్తు చేశాడు. భారత్‌తో మళ్లీ మళ్లీ మ్యాచ్‌లు ఆడాలని కోరుకుంటున్నానన్నాడు. రెండు దేశాల ప్రజలు తమ క్రికెటర్లను ఎంతగానో ప్రేమిస్తారు. ఈ దేశాల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ చూడాలని కోరుకుంటారని అఫ్రిది పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.