(Local) Thu, 18 Jul, 2019

ద్యుతీ చంద్ మరో సంచలన విజయం

July 10, 2019,   2:54 PM IST
Share on:

ఇండియా యువత అంతా ప్రపంచ  క్రికెట్‌పై దృష్టి సారించిన సమయంలో స్ప్రింటర్ ద్యుతీ చంద్ మరో సంచలన విజయం నమోదు చేసింది. నాప్లెస్ వేదికగా వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో భాగంగా జరిగిన 100 మీటర్ల రేసులో స్వర్ణ పతాకం గెలిచింది. 100 మీటర్ల పరుగును 11.32 సెకన్ల పూర్తి చేసి విజేతగా నిలిచింది. కాగా, స్వర్ణ పతాకం సంపాదించిన ద్యుతీపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు ద్యుతీని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు.

 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.