(Local) Tue, 17 Sep, 2019

ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళా క్రికెటర్ సంచలన పోస్ట్ ...

August 14, 2019,   7:05 PM IST
Views: 117
Share on:
ఇన్‌స్టాగ్రామ్‌లో  మహిళా క్రికెటర్ సంచలన పోస్ట్ .. ...

ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ సారా టేలర్ ఇటు వికెట్ కీపింగ్‌ అటు తన బ్యాటింగ్‌ తీరుతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తుంటారు. కొంత కాలంగా అతిగా ఆత్రుత చెందడం వంటి సమస్యతో బాధపడుతున్న ఆమె కొన్ని రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన నగ్న చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఒంటిపై ఏ మాత్రం దుస్తులు లేకుండా వికెట్ కీపింగ్ చేస్తూ ఫొటోకు పోజిచ్చారు. ఈ ఫొటో షేర్ చేయడం వెనక ఓ బలమైన కారణం ఉంది. మహిళల శరీరం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిచేందుకు ఉమెన్ హెల్త్ యూకే ఓ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. దీంట్లో సారా నగ్న దేహంతో ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఇలా చేయడానికి కారణాలేంటో వివరణ కూడా ఇచ్చారు. 

‘మహిళలు తమ దేహంతో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారికి అవగాహన కల్పించేందుకే ఇలా చేశాం. నా ఫొటో చూసిన వారెవరైనా నేను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చానని తెలుసుకుంటారు. నా శరీరంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా.. వాటిలో కొన్నింటింని అదిగమించా, ప్రతి అమ్మాయి అందమైందే.. దయచేసి గుర్తుంచుకోండి’ అని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు తననను భాగస్వామిని చేసిన ఉమెన్స్‌హెల్త్‌ యూకే సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. షూటింగ్‌ అసౌకర్యంగా అనిపించినా ఓ మంచి కార్యం కోసం ధైర్యంగా చేయగలిగాని చెప్పారు.

సంబంధిత వర్గం
జెర్సీలపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆగ్రహం
జెర్సీలపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆగ్రహం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.