(Local) Thu, 18 Jul, 2019

ప్రపంచ కప్ : ఆసిస్ కు ఆతిధ్య జట్టు షాక్... ఫైనల్ కు ఇంగ్లాండ్

July 11, 2019,   10:57 PM IST
Share on:

అనుకున్నదే అయింది. కానీ ఇంత సులువుగా అయిపోతుంది అని ఎవరు అనుకోని ఉండరేమో. హోరాహోరీ తప్పదు అనుకున్న మ్యాచ్ ఏకపక్షం అయిపోయింది. సెమిస్ లో ఆసిస్ కథ ముగిసింది. ఇంగ్లాండ్ ఫైనల్స్ లో అడుగు పెట్టింది. ప్రపంచకప్ లో ఇక మిగిలింది ఒక్కటే మ్యాచ్. భారత్ ను ఓడించి ఫైనల్స్ లో అడుగుపెట్టిన కివీస్ ఈసారైనా కప్ కచ్చితంగా గెలవాలని భావిస్తుంటే, సొంతగడ్డపై కప్ ను చేజార్చుకోకూడదని ఇంగ్లాండ్ చూస్తుంది. ఎవరు గెలిచినా ఒక చరిత్రే. చూడాలి మరి కప్ ''అతిదులదా'', ''ఆతిధ్యం'' ఇస్తున్న వాళ్లదా. కానీ కప్ మాత్రం ఇద్దరినీ ఊరిస్తుంది. 

సెమిస్ మ్యాచ్ విషయానికి వస్తే...ఆసిస్ అంత సులువుగా ఓడిపోతుంది అని ఎవరు ఊహించి ఉండరేమో. ఆసిస్ కు కీలక బలం ఓపెనర్స్. వాళ్లే కీలక సమయంలో చేతులు ఎత్తేయడంతో ఆసిస్ కు గట్టి దెబ్బ తగిలింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెనుతిరిగారు. ఇలాంటి సమయంలో స్మిత్ ఆదుకున్నాడు. కానీ అది సరిపోలేదు. ఇంగ్లాండ్ బౌలింగ్ దాటికి ఆసిస్ కుప్పకూలింది. ముందు వోక్స్, ఆర్చర్ ఆసీస్ పై నిప్పులు చెరిగే బంతులు వేసి ఆసీస్ కు కళ్లెం వేసేసారు. ఇలాంటి సందర్భంలో స్మిత్ 85 ఒంటరి పోరాటం చేసాడు. రక్తం వచ్చినా ఆడిన క్యారీ 46 పరుగులతో రాణించాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ రాణించకపోవడంతో 223 పరుగులకు పరిమితం అయింది. అయినా బౌలింగ్ ఉంది కదా అనుకున్న ఆసిస్ ను ఆతిధ్య జట్టు ఓ ఆటాడుకుంది. ఓపెనర్స్ గా వచ్చిన రాయ్, బెయిర్ స్టో సెంచరీ పార్టనర్ షిప్ తో ఆసిస్ ఆశలపై నీళ్లు చల్లుతూ ఆడారు. భారీ పార్టనర్ షిప్ తరువాత బెయిర్ స్టో 34  అవుట్ అయినా.. ఆసిస్ కు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంక సెంచరీకి చేరువలో రాయ్ కూడా 85 పరుగులు కొట్టి పెవిలియన్ చేరాడు. ఆసిస్ బౌలర్ లను సులువుగా ఆడి ఇంగ్లాండ్ ను విజయతీరాలకు చేర్చారు. వాళ్ళ వికెట్స్ పడిన ఇంగ్లాండ్ కు భయపడాల్సిన అవసరం లేకపోయింది. వన్ డౌన్ వచ్చిన రూట్ 49 మోర్గాన్ 45 పరుగులతో మరో వికెట్ పడకుండా మ్యాచ్ ని 32.1 ఓవర్స్ లో  ముగించారు. తృటిలో రూట్ అర్థశతకం మిస్ అయింది. ఆసీస్ బౌలర్స్ లో స్టార్క్ కి 1 పాట్ కమ్మిన్స్ కి 1 వికెట్ పడింది.  

ఇక మిగిలింది ఫైనల్ మ్యాచ్ మాత్రమే. ఆదివారం కోసం రెండు జట్లు ఎదురు చూస్తున్నాయి. రెండు జట్ల కల ఇంక ఒక్క అడుగు దూరంలో. ఏది గెలిచినా చరిత్రే.  పైగా రెండు జట్లు సమానంగా ఉండడంతో ఆసక్తి నెలకొంది. చూద్దాం మరి ప్రపంచకప్ ఎవరిని వరిస్తుందో....

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.