(Local) Tue, 21 May, 2019

రక్తమోడుతున్న బ్యాటింగ్‌ కొనసాగించిన వాట్సాన్ ...

May 14, 2019,   2:30 PM IST
Share on:

ముంబైతో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్స్‌ సందర్భంగా .. వాట్సన్‌కు సంబంధించిన ఓ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.  ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేసే సమయంలో వాట్సన్‌ మోకాలి వద్ద గాయమైంది. కానీ.. మేనేజ్‌మెంట్‌కి చెప్పకుండా ఆ గాయంతోనే అతను మ్యాచ్‌లో కొనసాగాడు. గాయం తీవ్రత పెరిగినా జట్టు కోసం పోరాడాడు. రక్తమోడుతున్నా ఎవరికీ చెప్పకుండానే బ్యాటింగ్‌ కొనసాగించాడు. గాయానికి సంబంధించిన రక్తంతో వాట్సన్‌ ఫ్యాంట్‌ కొంత భాగం తడిచిపోయినా గ్రౌండ్‌ను వదల్లేదు. ఉత్కంఠగా సాగడంతో మ్యాచ్‌ జరుగుతున్నంత సేపూ ఈ గాయాన్ని కూడా ఎవరూ చూడలేదు.

చెన్నై టీమ్‌ మేట్‌ హర్భజన్‌ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడిస్తూ వాట్సన్‌ పోరాటపటిమను మెచ్చుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం వాట్సన్‌ గాయానికి ఆరు కుట్లు పడ్డాయని భజ్జీ చెప్పాడు. 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.