(Local) Tue, 21 May, 2019

గ్లోబల్ రికార్డుని బద్దలు కొట్టిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్

May 14, 2019,   2:21 PM IST
Share on:

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హాట్ స్టార్ గత గ్లోబల్ రికార్డు కూడా బద్దలైంది. ఈ సీజన్‌లో మార్చి 28న ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ని అత్యధికంగా 12.7 మిలియన్ మంది వీక్షించారు. ఆ రికార్డు వీక్షకుల సంఖ్యని ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అధిగమించడం విశేషం. కేవలం మూడు వారాల్లోనే హాట్ స్టార్ 267 మిలియన్ ఆడియన్స్ మార్కుని అందుకుంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. అనంతరం ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య చేధనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది. చెన్నై జట్టులో షేన్ వాట్సన్(80) చివరివరకు పోరాడాడు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.