(Local) Wed, 23 Oct, 2019

ఫైనల్ కి టీం ఇండియా...

July 10, 2019,   1:56 PM IST
Share on:
ఫైనల్ కి  టీం ఇండియా...

సెమీస్ మ్యాచ్ పై భారత అభిమానులు పెట్టుకున్న ఆశలన్ని ఆవిరి చేస్తూ వరుణుడు అడ్డుపడ్డాడు. న్యూజీలాండ్ మొదట బ్యాటింగ్ చేసి 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. మ్యాచ్ భారత్ కు అనుకూలంగా మారుతుంది అనుకున్న తరుణంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో మ్యాచ్ ను రిజర్వ్ డేకు వాయిదా వేయడం జరిగింది. అంటే నేటికి.  ఇప్పుడు వర్షం వల్ల మరింత అంతరాయం లేకపోతే న్యూజీలాండ్ రిజర్వ్ డే రోజున మిగతా 3.5 ఓవర్లు బ్యాటింగ్ చేస్తుంది. తర్వాత భారత్ బ్యాటింగ్ చేస్తుంది. బుధవారం కూడా మాంచెస్టర్ లో మబ్బులు కమ్ముకొని ఉండే అవకాశం ఉంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం కాస్త తేమ వాతావరణం ఉండనుందని తెలుస్తోంది. మ్యాచ్‌లో మళ్లీ వర్షం పడితే మ్యాచ్ ఫలితం తేలడానికి భారత్ కనీసం 20 ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. పూర్తిగా వర్షం పడి మ్యాచ్ పూర్తి కాకపోతే భారత్ ఫైనల్ చేరుతుంది. ఒక వేళ మ్యాచ్ జరిగినా  భారత్ కే విజయావకాశాలున్నాయి. న్యూజిలాండ్ 250 పరుగులకు మించి చేసే అవకాశం లేదు. భారత్ 250 పరుగులను అలవోకగానే చేరుకోగలదు. పిచ్ అనుకూలంగా లేకపోతే మాత్రం భారత్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. పిచ్ సహకరిస్తే ఖచ్చితంగా భారత్ దే విజయం. మ్యాచ్ జరగకపోయినా పాయింట్ల ఆధారంగా ఇండియా ఫైనల్ కు చేరుకుంటుంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.