(Local) Mon, 09 Dec, 2019

క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం

November 28, 2019,   9:15 AM IST
Share on:
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం

అంబటి రాయుడిపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చర్యలకు రంగం సిద్ధం చేసింది. హెచ్ సీఏలో అవినీతిని ప్రశ్నించిన అంబటిపై చర్యలు తీసుకుంటామని క్రికెట్ పెద్దలు వ్యాఖ్యలు చేస్తున్నారు. హెచ్ సీఏ అవినీతిపై మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ లో విజ్ఞప్తి చేస్తూ.. దయ చేసి అవినీతిని అంతం చేయాలని, ఏసీబీ కేసులున్న పాలకులు ఆటగాళ్ల ఎంపికపై ప్రభావం చూపిస్తుంటే హైదరాబాద్ క్రికెట్ ఎలా గొప్పగా పేరు తెచ్చుకుంటుందని ప్రశ్నించారు.

ఈ ట్వీట్ పై స్పందించిన హెచ్ సీఏ నూతన అధ్యక్షుడు మహ్మాద్ అజారుద్దీన్ అంబటి రాయుడు ఓ ఫ్రస్టేటెడ్ క్రికెట్ అని పేర్కొన్నారు. కొన్నాళ్లు ఓపిక పట్టాలని చెప్పినా అర్థం చేసుకోలేదని అన్నారు. హెచ్ సీఏ గౌరవానికి భంగం కలిగించిన అంబటి రాయుడిపై చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని హెచ్ సీఏ కార్యదర్శి ఆర్ విజయానంద్ తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.