(Local) Mon, 21 Oct, 2019

నేను దేశం కోసమే ఆడతా: రోహిత్

August 02, 2019,   9:35 PM IST
Share on:
నేను దేశం కోసమే ఆడతా: రోహిత్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ మధ్య గత మూడు వారాలుగా కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. దీనిపై మూడు రోజుల క్రితం విరాట్ క్లారీటీ ఇచ్చాడు. కానీ రోహిత్ మాత్రం ఇప్పటికి స్పందించలేదు. దీనిపై టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి స్పందిస్తూ.. భారత జట్టులో విభేదాలు అంటూ చేస్తున్న ప్రచారమంతా నాన్సెన్స్‌ అని కొట్టిపారేశాడు. కానీ ట్విట్టర్ లో రోహిత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెవిలియన్ నుంచి మైదానంలోకి వెళ్తున్న ఫోటోను షేర్ చేసిన రోహిత్ నేను ప్రతిసారి జట్టు కోసం కాదు.. దేశం కోసం బరిలోకి దిగుతా అని కామెంట్ చేశాడు.

సంబంధిత వర్గం
సఫారీల ముందు భారీ స్కోర్ -  ప్రస్తుతం  9/2
సఫారీల ముందు భారీ స్కోర్ - ప్రస్తుతం 9/2

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.