(Local) Fri, 22 Nov, 2019

'టీ20 ప్రపంచకప్' షెడ్యూల్ ను విడుదల చేసిన ఐసీసీ

November 05, 2019,   12:55 PM IST
Share on:
'టీ20 ప్రపంచకప్' షెడ్యూల్ ను  విడుదల చేసిన ఐసీసీ

క్రికెట్  అభిమానులు ఎదురుచూస్తున్న 'టీ20 ప్రపంచకప్' షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. ఈ టోర్నీ వచ్చే ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ ప్రపంచకప్ ను  కొత్త ఫార్మాట్లో నిర్వహించనున్నట్లు ఐసీసీ తెలిపింది.ఈ మెగా టోర్నీకి ఆస్ట్రేలియా వేదిక కానుంది. 'క్వాలిఫైయర్' మ్యాచ్ ల ద్వారా పపువా న్యూగినియా, ఐర్లాండ్, ఒమన్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ జట్లు  ఈ టోర్నీలో ఆడేందుకు అర్హత సాధించాయి. ఈ జట్లు తొలుత సూపర్-12 దశలో రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్నాయి. ఈ రెండు గ్రూపుల్లో రెండు పెద్ద జట్లను ఐసీసీ చేర్చింది.గ్రూప్ ‘ఎ’లో శ్రీలంక, న్యూగినియా, ఐర్లాండ్, ఒమన్ ఉండగా, గ్రూప్ ‘బి’లో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ ఉన్నాయి. గ్రూప్ ‘ఎ’ లో అగ్ర స్థానంలో నిలిచిన జట్టు, గ్రూప్ ‘బి’లో రెండో స్థానంలో నిలిచిన జట్టు సూపర్ -12 దశలో గ్రూప్- 1 లో చేరతాయి.ఈ గ్రూపులో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ ఉన్నాయి. గ్రూప్ ‘ఎ’ లో రెండవ స్థానంలో ఉన్న జట్టు, గ్రూప్ 'బి' లో అగ్రస్థానంలో ఉన్న జట్టు గ్రూప్-2 లో చేరతాయి.ఈ గ్రూప్ లో భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ జట్లు ఉన్నాయి. అక్టోబర్ 18న శ్రీలంక-ఐర్లాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో టోర్నీ ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 15న  మెల్ బోర్న్ లోని ఎంసీజీ మైదానంలో జరుగనుంది.

సంబంధిత వర్గం
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.