(Local) Tue, 20 Aug, 2019

వరల్డ్ కప్ : అస్ట్రేలియా పై 36 రన్స్ తో నెగ్గిన భారత్

June 09, 2019,   11:22 PM IST
Share on:

ప్రపంచకప్‌లో భారత్‌ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగులు తేడాతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. 

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు నెమ్మదిగా ఆరంభించారు. మిచెల్ స్టార్క్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి క్యాచ్ అవుట్ ప్రమాదం నుండి రోహిత్ బయటపడ్డాడు. మరోవైపు రోహిత్ కూడా వేగం పెంచి 21 ఓవర్ మొదటి బంతికి ఫోర్ కొట్టి అర్ధ శతకం చేసాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న రోహిత్ (57; 70బంతుల్లో 3×4, 1×6) జట్టు స్కోర్ 127 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.శతకం అనంతరం దూకుడు పెంచిన గబ్బర్ భారీ షాట్ ఆడి ఔట్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ కోహ్లీ (82: 77 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు), హార్డ్‌హిట్టర్ హార్దిక్ పాండ్య (48: 27 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు)లు వేగం పెంచడంతో స్కోర్ 300 చేరువలో వచ్చింది. అయితే పాండ్య ఔట్ అయినా.. చివరలో ధోనీ (27: 14 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్), కోహ్లీ బౌండరీల వర్షం కురిపించడంతో స్కోర్ బోర్డును 300 దాటించారు. చివరి ఓవర్లో రాహుల్ 14 పరుగులు చేయడంతో భారత్ 352 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో స్టోయినిస్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 50 ఓవర్లలో 316 రన్స్ చేసి ఆలౌటయింది. ఐతే భారీ టార్గెట్‌‌ను ఛేదించేందుకు ఆసీస్ జట్టు పోరాడినప్పటికీ ఆఖరులో వరస వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడిలో పడింది. అప్పటికే ప్రధాన వికెట్లను కోల్పోవడం, సాధించాల్సిన రన్‌రేట్‌ను పెరగడంతో ఆసీస్ టీమ్‌కు ఓటమి తప్పలేదు.ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో స్టీవెన్ స్మిత్ 69, డేవిడ్ వార్నర్ 56, అలెక్స్ కేరీ 55, ఉస్మాన్ ఖవాజా 42 పరుగులతో రాణించారు. అరోన్ ఫించ్ 36, మాక్స్‌వెల్ 28 రన్స్ చేసి పరవాలేదనిపించారు. ఓ దశలో టార్గెట్‌ను ఛేదిస్తుందని అనిపించినా...స్టీవ్ స్మిత్‌ను ఔట్‌చేసి ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు భువనేశ్వర్. అ తర్వాత వరుసగా స్టోయినిస్, మాక్స్‌‌వెల్ వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా. ఇక కౌంటర్‌రైల్, కమిన్స్ వికెట్లను పడగొట్టి బుమ్రా ఆస్ట్రేలియాపై మరింత ఒత్తిడి పెంచాడు. ఆఖరులో అలెక్స్ కేరీ పోరాడినప్పటికీ అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో ఫించ్ సేన ఓటమి పాలయింది. భారత బౌలర్లలో బుమ్రా, భువనేశ్వర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా..చాహల్ రెండు వికెట్లు తీశాడు.ఇక ఈ నెల 13న ట్రెంట్‌బ్రిడ్జ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తలపడనుంది కొహ్లీ సేన.

మాన్ అఫ్ ది మ్యాచ్ :  శిఖర్ ధావన్

రికార్డు :   1.వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై భారీ స్కోర్ చేసిన జట్టుగా భారత్ రికార్డ్ సృష్టించింది.

                2.ప్రపంచకప్‌లో టీమిండియాకు ఇది నాలుగో అత్యధిక స్కోరు కావడం విశేషం.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.