(Local) Wed, 16 Oct, 2019

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పట్టికలో అగ్రస్థానంలో కోహ్లీసేన

October 07, 2019,   5:41 PM IST
Share on:
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పట్టికలో అగ్రస్ ...

విశాఖలో దక్షిణాఫ్రికాతో ముగిసిన తొలి టెస్టులో భారత్ ఘన విజయంతో భారత్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఈ టెస్టులో భారత్ అద్భుత ఆటతో ఆకట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆటగాళ్లు అదరకొట్టారు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, మయాంక్ అగర్వాల్ సెంచరీల మోత మోగించగా.. బౌలర్లు షమీ, జడేజా, అశ్విన్ చెలరేగారు.ఈ టెస్ట్ విజయంతో భారత్‌ ఖాతాలో 40 పాయింట్లు చేరాయి. ఇప్పటికే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీసేన ఎవరికీ అందనంత ఎత్తులోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు టీమిండియా ఖాతాలో 120 పాయింట్లు ఉండగా.. ఇప్పుడు 40 పాయింట్లు చేరడంతో 160 పాయింట్లతో కోహ్లీసేన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. మరోవైపు దక్షిణాఫ్రికాకు ఇదే తొలి సిరీస్‌. ఈ ఓటమితో సున్నా పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది.ఇటీవలే తలపడ్డ న్యూజిలాండ్‌, శ్రీలంక జట్లు 60 పాయింట్లతో వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నాయి. యాషెష్-209లో పాల్గొన్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ జట్లు 56 పాయింట్లతో వరుసగా 4, 5 స్థానాల్లో కొనసాగుతున్నాయి. భారత్ సిరీస్‌లో రెండు ఓటములను ఎదుర్కొన్న విండీస్‌ ఖాతాలో పాయింట్లేమీ లేకపోవడంతో 6వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు ఇంకా ఛాంపియన్‌షిప్‌లో పోటీపడలేదు. కాబట్టి ఆ జట్లు 8, 9 స్థానాల్లో ఉన్నాయి.

సంబంధిత వర్గం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.