(Local) Fri, 23 Aug, 2019

ఆగస్టు 15 తర్వాతే కోచ్ ఎంపిక…

August 11, 2019,   5:38 PM IST
Share on:

టీమిండియా చీఫ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసిన వారినందరినీ వడబోసి ఆరుగురిని ఇంటర్వూ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇంటర్వూలు ఈ నెల 13,14 తేదీల్లో జరగాల్సి ఉంది. కానీ కొంత పేపర్ వర్క్ ఇంకా మిగిలి ఉండడంతో ఈ నెల 15 తర్వాత ఇంటర్వూలు జరుగుతాయని , ఒక రోజులో ఇంటర్వూల ప్రక్రియను పూర్తి చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘ తొలుత ఇంటర్వూలను ఆగస్టు 13, 14 తేదీల్లో నిర్వహించాలని అనుకున్నాం. కోచ్ పదవికోసం దరఖాస్తు చేసిన వారిలో ఆరుగురిని ఇంటర్వూ కోసం ఎంపిక చేశాం. వారిని ఇంటర్వూ చేయడానికి ఒక రోజు సరిపోతుంది.పేపర్ వర్క్ మిగిలి ఉండడంతో ప్రక్రియను వాయిదా వేయాల్సి వస్తోంది. 15 వ తేదీ లోగా ఈ ప్రక్రియ జరగదు. కోచ్ ఎంపికపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయాన్ని తీసుకోవడం లేదు. క్రికెట్ సలహా కమిటీ కోచ్‌ను ఎంపిక చేస్తుంది. భారత మహిళా జట్టు కోచ్ ఎంపిక తరహాలోనే దీన్ని కూడా నిర్వహిస్తున్నాం’ అని ఆ వర్గాలు వెల్లడించాయి. క్రికెట్ సలహా కమిటీ(సిఎసి) టీమిండియా కోచ్‌ను ఎంపిక చేస్తుంది. కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామిలతో కూడిన కమిటీ ఇంటర్వూలను నిర్వహిస్తుంది.

 

సంబంధిత వార్తలు

సంబంధిత వర్గం

దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా లాన్స్ క్లూసెనర్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.