(Local) Tue, 17 Sep, 2019

లారా విందు ... బ్రావో పోస్ట్స్

August 20, 2019,   11:57 AM IST
Views: 53
Share on:
లారా విందు ... బ్రావో పోస్ట్స్

ప్రస్తుతం భారత క్రికెటర్లు వెస్టిండీస్  పర్యటనలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వెస్టిండీస్ పై ఇప్పటికే టీ 20, వన్డే సిరీస్‌లు గెలవగా, ఇక టెస్టు సిరీస్ పై భారత్ కన్నేసింది. ఈ క్రమంలో కాస్త విశ్రాంతి తీసుకుంటున్న భారత జట్టు ఆటగాళ్లు విండీస్‌ లెజెండ్‌ లారా తన నివాసంలో ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ విందులో ఓపెనర్లు, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ, శిఖర్‌ ధావన్‌ తో పాటు కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, రవీంద్ర జడేజా, కేదార్‌ జాధవ్‌, యుజువేంద్ర చాహల్‌ పాల్గొన్నారు. ఈ విందు కార్యక్రమ ఫోటోలను మాజీ క్రికెటర్‌ బ్రావో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.