(Local) Thu, 05 Dec, 2019

భారత్- బంగ్లాదేశ్ మొదటి టెస్టు : మొదటి రోజు టీమిండియాదే...

November 15, 2019,   10:45 AM IST
Share on:
భారత్- బంగ్లాదేశ్ మొదటి టెస్టు : మొదటి రోజు  టీమిం ...

భారత్- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా 150 పరుగులు చేసి ఆలౌటైంది. మొదటి రోజు 58.3 ఓవర్లలో 160 పరుగులు చేసింది. భారత పేసర్ల దెబ్బకు బంగా బ్యాట్స్ మెన్లు కకావికలమయ్యారు. బంగ్లా బ్యాట్స్ మెన్లలో ముషికర్ రహీమ్(43), మోమినల్ హక్యూ(37) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. మిగితా బాట్స్ మెన్లు స్వల స్కోర్ కే ఔట్ కావడంతో బంగ్లా చేతులెత్తేసింది. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు పడగొట్టగా అశ్విన్, ఉమేష్ యాదవ్, ఇశాంత్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు.  

అనంతరం మొదటి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్ కు బంగ్లా మీడియం పేసర్ అబూ జయేద్ షాకిచ్చాడు. పుల్ ఫాంలో ఉన్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(6; 14 బంతుల్లో 1) అబూ జయేద్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి టీమిండియా స్కోర్ 14/1. ఈ దశలో మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (37;81 బంతుల్లో 6పోర్లు) కు నయావాల్ పుజారా(43; 61 బంతుల్లో 7పోర్లు) జతకలిసాడు. వీరిద్దరూ బంగ్లాదేశ్ బౌలర్లను తేలికగా ఎదుర్కొంటూ పోటీ పడి పరుగులు సాధించారు. వీరిద్దరూ రెండో వికెట్ 72 పరుగులు జోడించారు.దీంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి టీంఇండియా 26ఓవర్లలో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ స్కోర్ కంటే మరో 64 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉండడంతో రెండో రోజు టీమిండియా భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంది. 

 

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.