(Local) Mon, 06 Apr, 2020

వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?

November 19, 2019,   6:45 PM IST
Share on:
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?

వెస్టిండీస్‌తో డిసెంబర్‌లో జరగనున్న వన్డే సిరీస్‌కి భారత జట్టు సీనియర్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్‌ గడ్డపై డిసెంబర్‌ 6 నుంచి టీమిండియాతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ని వెస్టిండీస్‌ ఆడేలా ఇప్పటికే బీసీసీఐ షెడ్యూల్‌ రూపొందించింది. అయితే ఇందులో వన్డే సిరీస్‌ నుంచి రోహిత్‌ శర్మకి విశ్రాంతినివ్వాలని భారత సెలక్టర్లు యోచిస్తున్నారు. రోటేషన్‌ పద్దతిలో ఇటీవల బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌ నుంచి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. కాగా వెస్టిండీస్‌తో టీ20, వన్డే సరీస్‌ల కోసం ఒకేసారి జట్లని ప్రకటించాలని నిర్ణయించుకున్న భారత సెలక్టర్లు ఈ నెల 21న గురువారం ముంబయిలో సమావేశం కానున్నారు. ఈ సమయంలో రోహిత్‌శర్మకి రెస్ట్‌ ఇచ్చే విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి దాదాపు 60 మ్యాచ్‌ల్ని రోహిత్‌ శర్మ ఆడారు. ఇందులో 16 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఉండగా మిగిలిన వాటిల్లో టీ20లు, వన్డేలు, టెస్టులు కూడా ఉన్నాయి.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.