(Local) Wed, 16 Oct, 2019

తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం

October 06, 2019,   5:03 PM IST
Share on:
తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. 203 పరుగుల తేడాతో టిమిండియా విజయదుందుభి మోగించింది. సఫారీలో రెండో ఇన్నింగ్స్లో 191 పరుగులు చేసి ఆలౌటైంది. షమీ దెబ్బకు సఫారీ బ్యాట్స్‌మెన్లు కకావికలమయ్యారు. రెండో ఇన్నింగ్ పెడిట్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. మిగితా బ్యాట్స్‌మెన్లు తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. ముత్తుస్వామీ (49), మరక్రమ్(39) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు పడగొట్టగా జడేజా నాలుగు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు. రోహిత్ శర్మ రెండు సెంచరీలు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.  ఈ మ్యాచ్ లో రోహిత్ రికార్డులు సృష్టించాడు. ఓపెనర్ గా ఆరంగ్రేటంలో తొలి సారి రెండు సెంచరీలు చేయడమే కాకుండా అత్యధిక (303) పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. మూడు ఫార్మాట్లలో ఒకే మ్యాచ్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన వీరుడిగా నిలిచాడు. వైజాగ్ టెస్టులో 13 సిక్స్ లు బాది చరిత్రలోకెక్కాడు. 66 మ్యాచ్ ల్లో 350 వికెట్లు తీసి ముత్తయ్య మరళీధరన్ రికార్డును అశ్విన్ సమం చేశాడు. 

ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్: 502/7Declared , దక్షిణాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్: 431 ఆలౌట్

ఇండియా సెకండ్ ఇన్నింగ్స్:323/4Declared mదక్షిణాఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్: 191 ఆలౌట్ 

 

సంబంధిత వర్గం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.