(Local) Fri, 13 Dec, 2019

ఐపీఎల్‌ కొత్త సీజన్‌ ఆటగాళ్ల జాబితా

November 16, 2019,   1:39 PM IST
Share on:
ఐపీఎల్‌ కొత్త సీజన్‌ ఆటగాళ్ల జాబితా

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కొత్త సీజన్‌కు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. ఈసారి ఎలాగైనా ట్రోఫీ సాధించడానికి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎవరిని జట్టులోకి తీసుకోవాలో అంచనాలు సిద్ధం చేసుకుంటున్నాయి. వచ్చే సీజన్‌ ట్రేడింగ్‌ విండో ముగియడంతో జట్టు తమ వద్ద నిలుపుకున్న ఆటగాళ్లు, విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్‌ యాజమాన్యం విడుదల చేసింది.

చెన్నై సూపర్‌కింగ్స్‌

చెన్నై జట్టు తమ దగ్గర అట్టి పెట్టుకున్నవాళ్లలో ఎంఎస్‌ ధోనీ, సురేశ్‌ రైనా, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, మురళీ విజయ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, షేన్‌ వాట్సన్‌, డ్వేన్‌ బ్రావో, కేదార్‌ జాదవ్‌, లుంగి ఎంగిడి, రవీంద్ర జడేజా, మిచెల్‌ శాంట్నర్‌, మోను కుమార్‌, ఎన్‌ జగదీశన్‌, హర్భజన్‌ సింగ్‌, కరణ్ శర్మ, ఇమ్రాన్‌ తాహిర్‌, దీపక్‌ చాహర్‌, కేఎం ఆసిఫ్‌ ఉన్నారు. అదే జట్టు నుంచి దూరమైన వాళ్లలో మోహిత్‌ శర్మ, శామ్‌ బిల్లింగ్స్‌, డేవిడ్‌ విల్లే, స్కాట్‌ కగిలీన్‌, ధ్రువ్‌ షోరె, చైతన్య బిష్ణోయి ఉన్నారు.

ముంబయి ఇండియన్స్‌

అంబానీ జట్టు ముంబయి విషయానికొస్తే... రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, క్వింటన్‌ డికాక్‌, మిచెల్‌ మెక్‌లగన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, లసిత్‌ మలింగ, కృనాల్‌ పాండ్య, సూర్యకుమార్‌ యాదవ్‌, అన్మోల్‌ ప్రీత్‌ సింగ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, రాహుల్‌ చాహర్‌, ఇషాన్‌ కిషన్‌, అనుకుల్‌ రాయ్‌, ధవళ్‌ కుల్‌కర్ణి, ఆదిత్య తారె, షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌, జయంత్‌ యాదవ్‌ జట్టుతో కొనసాగుతారు. యువరాజ్‌ సింగ్, ఎవిన్‌ లూయిస్‌, ఆడమ్‌ మిల్న్‌, బెరెన్‌డార్ఫ్‌, బరిందర్‌ శరణ్‌, బెన్‌ కటింగ్, అల్జారీ జోసెఫ్‌, బ్యూరాన్‌ హెండ్రిక్స్‌, రషీక్‌ సలామ్‌, పంకజ్‌ జైశ్వాల్‌ జట్టును వీడుతారు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీ అయితే కేన్‌ విలియమ్సన్‌, డేవిడ్‌ వార్నర్‌, మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్‌, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీ, అభిషేక్‌ శర్మ, జానీ బెయిర్‌స్టో, వృద్ధిమాన్‌ సాహా, శ్రీవత్స్‌ గోస్వామి, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్ అహ్మద్‌, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌, షాబాజ్‌ నదీమ్‌, బిల్లీ స్టాన్‌లేక్‌, బసిల్‌ థంపి, టీ నటరాజన్‌ను తన వద్ద అట్టిపెట్టుకుంది. ఇక విడుదల చేసినవారిని చూస్తే దీపక్‌ హుడా, మార్టిన్‌ గప్తిల్‌, రికీ భుయ్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, యూసఫ్‌ పఠాన్‌ ఉన్నారు.

కింగ్స్‌ XI పంజాబ్‌

పంజాబ్‌ జట్టులో కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌ గేల్‌, మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, నికోలస్‌ పూరన్‌, మన్‌దీప్‌ సింగ్‌, కృష్ణప్ప గౌతమ్‌, మహ్మద్‌ షమి, ముజీబ్‌ అర్‌ రెహ్మాన్‌, అర్షదీప్‌ సింగ్‌, హర్దస్‌ విల్‌జోయిన్‌, మురుగన్‌ అశ్విన్‌, జే సుచిత్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, దర్శన్‌ నల్కండె కొనసాగుతారు. డేవిడ్‌ మిల్లర్‌, ఆండ్రూ టై, శామ్‌ కరణ్‌, మోజెస్‌ హెన్రిక్స్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, అగ్నివేశ్‌ అయాచి, వరుణ్‌ చక్రవర్తి జట్టుకు దూరమవుతారు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌

కోల్‌కతా విషయానికొస్తే... దినేశ్ కార్తీక్‌, ఆండ్రీ రసెల్‌, సునీల్‌ నరైన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, శుభ్‌మన్‌ గిల్‌, లాకీ ఫెర్గూసన్‌, నితీశ్‌ రాణా, సందీప్‌ వారియర్‌, హ్యారీ గర్నీ, కమలేశ్‌ నాగర్‌కోటి, శివమ్‌ మావి, సిద్దేశ్‌ లాడ్‌ జట్టులో ఉంటారు. రాబిన్‌ ఉతప్ప, క్రిస్‌ లిన్‌, పియూష్‌ చావ్లా, జో డెన్లీ, యర్రా పృథ్వీరాజ్‌, నిఖిల్‌ నాయక్‌, కేసీ కరియప్ప, మాథ్యూ కెల్లీ, అన్రిచ్‌ నోర్జె, శ్రీకాంత్‌ ముంఢె, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ జట్టు నుంచి బయటకు వచ్చేస్తారు.

రాజస్థాన్‌ రాయల్స్‌

స్టీవ్‌ స్మిత్‌, సంజు శాంసన్‌, జోఫ్రా ఆర్చర్‌, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, రియాన్‌ పరాగ్‌, శశాంక్‌ సింగ్‌, శ్రేయస్‌ గోపాల్‌, మహిపాల్‌ లోమ్రర్‌, వరుణ్‌ అరోన్‌, మనన్‌ వోహ్రా, మయాంక్‌ మర్కండే, రాహుల్‌ తెవాతియా, అంకిత్‌ రాజ్‌పుత్‌లను రాజస్థాన్‌ నిలబెట్టుకుంది. ఆస్టన్‌ టర్నర్‌, ఒషానే థామస్‌, శుభమ్‌ రంజన్‌, ప్రశాంత్‌ చోప్రా, ఇష్‌ సోది, ఆర్యమన్‌ బిర్లా, జైదేవ్‌ ఉనద్కత్‌, రాహుల్‌ త్రిపాఠి, స్టువర్ట్‌ బిన్నీ, లియామ్‌ లివింగ్‌స్టన్‌, సుదేశన్‌ మిథున్‌లను విడుదల చేసింది.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

ఆర్సీబీ అయితే విరాట్‌ కోహ్లీ, మొయిన్‌ అలీ, యుజువేంద్ర చాహల్‌, ఏబీ డివిలియర్స్‌, పార్థివ్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, పవన్‌ నేగి, ఉమేశ్‌ యాదవ్‌, గురుకీరత్‌ మన్‌, దేవత్‌ పడిక్కల్‌, శివమ్‌ దూబె, వాషింగ్టన్‌ సుందర్‌, నవదీప్‌ సైనిలను అట్టిపెట్టుకుంది. మార్కస్‌ స్టొయినిస్‌, షిమ్రన్ హెట్‌మయర్‌, అక్షదీప్‌ నాథ్‌, నాథన్‌ కుల్టర్‌నైల్‌, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌, ప్రయాస్‌ బర్మన్‌, టిమ్‌ సౌథీ, కుల్వంత్‌ కేజ్రోలియా, హిమ్మత్‌ సింగ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, మలింగ్‌ కుమార్‌, డేల్‌ స్టెయిన్‌ను విడుదల చేసింది.

దిల్లీ క్యాపిటల్స్‌

గతేడాది అంచనాలకు మించి ప్రదర్శన చూపించిన దిల్లీ క్యాపిటల్స్‌లో శ్రేయస్‌ అయ్యర్‌, పృథ్వీషా, శిఖర్ ధావన్‌, రిషభ్‌ పంత్‌, ఇషాంత్‌ శర్మ, అమిత్‌ మిశ్రా, అవేశ్‌ ఖాన్‌, సందీప్‌ లమిచాన్‌, కగిసో రబాడ, కీమో పాల్‌, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, రవిచ్రందన్‌ అశ్విన్‌, అజింక్య రహానె కొనసాగుతారు. ఇక దూరమయ్యేవాళ్లు చూస్తే క్రిస్‌ మోరిస్‌, కొలిన్‌ ఇంగ్రామ్‌, బి అయ్యప్ప, హనుమ విహారి, జలజ్‌ సక్సేన, మన్‌జ్యోత్‌ కల్రా, నాథుసింగ్‌, అంకుష్‌ బేయాన్స్‌, కొలిన్‌ మన్రో ఉన్నారు.

 

 

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.