
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ప్రవేశపెట్టినప్పటి నుండి టెస్టులలో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళుతోంది . జరిగిన ఏడు మ్యాచుల్లో కూడా విరాట్ కోహ్లి సేన ఏకపక్ష విజయాలు సాధించింది. ఇందులో చివరి నాలుగు టెస్టుల్లో అయితే ఏకంగా ఇన్నింగ్స్ తేడాతో జయకేతనం ఎగుర వేసింది. దీన్ని బట్టి ప్రపంచ క్రికెట్లో టీమిండియా విజయపరంపర ఏ స్థాయిలో సాగుతుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఏకంగా 360 పాయింట్లు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. మరో ఒకటి రెండు విజయాలు సాధిస్తే టీమిండియాకు ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయమవుతోంది. ఇటీవల సొంత గడ్డపై జరిగిన ఐదు మ్యాచుల్లో కూడా భారత్ భారీ విజయాలు సొంతం చేసుకుంది. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో జరిగిన చివరి రెండు టెస్టుల్లోనూ భారత్ ఇన్నింగ్స్ తేడాతో జయభేరి మోగించింది.
అంతేగాక వరుసగా నాలుగు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాలు సాధించిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డును కూడా తన పేరిట లిఖించుకుంది. ఇక, చాలా మ్యాచులను టీమిండియా మూడు రోజుల్లోనే కైవసం చేసుకుంటోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రక డేనైట్ టెస్టు మ్యాచ్‌లో అయితే రెండున్నర రోజుల లోపే విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఫలితాన్ని బట్టి టెస్టుల్లో భారత ఏకచక్రాధిపత్యం ఎలా సాగుతుందో ఊహించవచ్చు. ఒకప్పుడూ ప్రపంచ క్రికెట్‌ను శాసించిన దక్షిణాఫ్రికాను కూడా టీమిండియా చిత్తు చిత్తుగా ఓడించింది .భారత్ జోరు ముందు సౌతాఫ్రికా జట్టు పూర్తిగా చతికిల పడి పోయింది. చివరి రెండు మ్యాచుల్లో ఇన్నింగ్స్ తేడాతో ఓడి పోవడం దీనికి నిదర్శనం.
ఇక, భారత జట్టు విజయాల్లో సమష్టి కృషి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి సిరీస్‌లోనూ టీమిండియా ఆటగాళ్లు కలిసి కట్టుగా పోరాడుతున్నారు. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మలు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. ఇద్దరు వరుస సెంచరీలతో హోరెత్తించారు. ఇక, కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా పరుగుల వరద పారించాడు. సీనియర్లు అజింక్య రహానె, చటేశ్వర్ పుజారాలు కూడా తమ బ్యాట్‌కు పని చెప్పారు. కీలక సమయంలో ఇద్దరు భారీ స్కోర్లతో జట్టుకు అండగా నిలిచారు. మయాంక్ అగర్వాల్, రోహిత్‌ల రూపంలో భారత్‌కు ఓపెనర్లు దొరికారు. ఇద్దరు రెండు సిరీస్‌లలో కూడా సత్తా చాటారు. ఇప్పటికే వన్డే, ట్వంటీ20 ఫార్మాట్లో విధ్వంసక ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ టెస్టుల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. రోహిత్ విజృంభణతో భారత్‌కు ఎదురే లేకుండా పోతోంది.
బౌలింగ్‌లో కూడా టీమిండియాకు ఎదురే లేదు. ఇటు స్పిన్నర్లు, అటు ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. సౌతాఫ్రికా సిరీస్‌లో స్పిన్నర్లతో పాటు ఫాస్ట్ బౌలర్లు కూడా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్ మరోసారి జట్టుకు ప్రధాన అస్త్రంగా నిలిచాడు. రవీంద్ర జడేజా కూడా కీలక సమయంలో వికెట్లు తీస్తూ తనవంతు పాత్ర పోషించాడు. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన స్పిన్ జోడీగా జడేజా, అశ్విన్‌లు పేరు తెచ్చుకున్నారు. దక్షిణాఫ్రికాపై వీరిద్దరూ అద్భుత ప్రతిభను కనబరిచారు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో కూడా అశ్విన్ సత్తా చాటాడు. జడేజా కూడా ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకున్నాడు. ఇక, ఫాస్ట్ బౌలింగ్‌లో కూడా భారత్ సత్తా చాటింది.
స్పీడ్స్టర్లు మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌ల త్రయం ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నారు. తొలి టెస్టులో ఉమేశ్, షమిలు అద్భుతంగా రాణించారు. చివరి టెస్టులో ఉమేశ్, ఇషాంత్‌లు అసాధారణ రీతిలో చెలరేగి పోయారు. ఇషాంత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ విజృంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక, ఉమేశ్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో కూడా మూడు వికెట్లు తీశాడు. షమి కూడా కీలక వికెట్లతో తనవంతు పాత్ర పోషించాడు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా మారిన భారత్ టెస్టుల్లో వరుస విజయాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. భవిష్యత్తులో కూడా టీమిండియా జోరు ఇలాగే సాగుతుందనడంలో సందేహం లేదు.
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
బంగ్లాదేశ్ క్రికెటర్ కు జరిమానా
29 Nov 2019, 12:36 PM
-
రిషబ్ పంత్ ను హెచ్చరించిన వీవీఎస్ లక్ష్మణ్
28 Nov 2019, 4:02 PM
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
28 Nov 2019, 9:15 AM
-
వెస్టిండీస్ తో డిసెంబర్ లో జరిగే టి20 సంజూ శాంసన్ ...
27 Nov 2019, 3:56 PM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
విజయం దిశగా భారత్..పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్ ...
24 Nov 2019, 11:55 AM
-
సెంచరీ చేసిన కోహ్లీ..కష్టాల్లో బంగ్లా..
23 Nov 2019, 4:02 PM
-
రెండో టెస్ట్ : పటిష్ట స్థితిలో భారత్
23 Nov 2019, 12:33 PM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ లకు టీమిండియా ఎం ...
22 Nov 2019, 3:09 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ మండిపాటు...
20 Nov 2019, 10:26 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM
-
మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్
16 Nov 2019, 5:18 PM

ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.