(Local) Tue, 17 Sep, 2019

11ఏళ్ళ క్రికెట్ ప్రయాణంపై కోహ్లీ స్పెషల్ పోస్ట్

August 20, 2019,   11:58 AM IST
Views: 103
Share on:
11ఏళ్ళ క్రికెట్ ప్రయాణంపై కోహ్లీ స్పెషల్ పోస్ట్

విరాట్ కోహ్లీ.. సరిగ్గా 11 ఏళ్ల  క్రితం ఆగస్టు 18, 2008లో శ్రీలంకతో దంబుల్లాలో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన 11 ఏళ్ల  క్రికెట్ ప్రయాణంలో ఇప్పటివరకూ మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 20, 502 పరుగులు చేశాడు. ఇందులో 68 సెంచరీలు, 95 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను కోహ్లి తిరగరాశాడు.11 ఏళ్ల కెరీర్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సంధర్బంగా  కోహ్లి తన ట్వీటర్‌ ఖాతాలో సోమవారం ఒక స్పెషల్‌ పోస్ట్‌ పెట్టాడు. 11ఏళ్ల క్రితం టీనేజర్‌గా నేను క్రికెటర్‌ గా ప్రయాణం మొదలుపెట్టాను. ఈ సుదీర్ఘ నా క్రికెట్‌ ప్రయాణం నన్ను మరింత ప్రతిబింబించేలా చేసింది. దేవుడు నాకు ఇంతటి ఆశీర్వాదం ఇస్తాడని ఎప్పుడూ అనుకోలేదు అంటూ కోహ్లీ తన మనసులోని మాటలను ట్వీట్ చేశాడు.

సంబంధిత వర్గం
నేటి నుంచి భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్
నేటి నుంచి భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.