(Local) Mon, 06 Apr, 2020

సెంచరీ చేసిన కోహ్లీ..కష్టాల్లో బంగ్లా..

November 23, 2019,   4:02 PM IST
Share on:
సెంచరీ చేసిన  కోహ్లీ..కష్టాల్లో బంగ్లా..

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కోల్ కతాలో జరుగుతున్న డే/నైట్ టెస్టు కోహ్లీ సెంచరీ చేశాడు . పింక్ బాల్ తో మొదటి సెంచరీ నమోదు చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లోనే కెప్టెన్ గా 5 వేలపరుగుల మార్క్ ను దాటాడు. ఇప్పటికే భారత్ 150 పరుగుల ఆధిక్యాన్ని దాటేసింది. కోహ్లీ ఇలానే చెలరేగి ఆడితే బంగ్లాకు కష్టాలు తప్పకపోవచ్చు. రహానేతో కలిసి భారత్ ను పటిష్ట స్థితిలో నిలిపాడు. రహానే అవుట్ అయినా కోహ్లీ మాత్రం ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఈ శతకంతో టెస్టుల్లో 27 శతకాలు పూర్తి చేసుకున్నాడు కెప్టెన్ కోహ్లీ. అంతక ముందు భారత బౌలర్ల దాటికి బంగ్లా 106 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఇషాంత్ శర్మ 5 వికెట్లు తీసి పింక్ బాల్ తో మొదటి మ్యాచ్ లోనే రికార్డు సృష్టించాడు. ఇన్నింగ్స్ ఆరంభిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలిన పుజారా, రహానే, కోహ్లీ అర్థ శతకాలతో ఇన్నింగ్స్ ను నడిపించారు. మొదటి రోజు పుజారా వికెట్ పడ్డాక వచ్చిన రహానే కోహ్లీకి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి భారత్ ను ఆధిక్యంలోకి తెచ్చారు. తరువాత రహానే అవుట్ అయినా కోహ్లీ మాత్రం తనదైన శైలిలో ఆడాడు. ఈ క్రమంలో పింక్ బాల్ తో జరుగుతున్న మొదటి టెస్టులో సెంచరీ బాది రికార్డు సృష్టించాడు.

ప్రస్తుతం స్కోర్ 80 ఓవర్లలో 304/5

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.