(Local) Thu, 05 Dec, 2019

స్మిత్‌కు చేరువలో మయాంక్ ....

November 15, 2019,   4:31 PM IST
Share on:
స్మిత్‌కు చేరువలో మయాంక్ ....

ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 184 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో మయాంక్ సెంచరీని సాధించాడు. టెస్టుల్లో మయాంక్ అగర్వాల్‌కు ఇది 3వ సెంచరీ.స్వదేశంలో నాలుగో టెస్టు ఆడుతోన్న మయాంక్ అగర్వాల్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో మయాంక్ పలు రికార్డులకు చేరువయ్యాడు.

12 ఇన్నింగ్స్‌ల్లోనే మయాంక్ అగర్వాల్ టెస్టుల్లో మూడో సెంచరీని సాధించాడు. ఈ క్రమంలో ఓపెనర్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు సాధించిన విజయ్ మర్చంట్ రికార్డుని మయాంక్ అగర్వాల్ సమం చేశాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(4 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు) అగ్రస్థానంలో ఉండగా... సునీల్ గవాస్కర్(7 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు) రెండో స్థానంలో ఉండగా... కేఎల్ రాహుల్ 9 ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు సాధించాడు.

బాల్ టాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ తన పునరగామనంలో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరిస్‌లో 774 పరుగులు చేశాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరిస్‌లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్ తొమ్మిది నెలల కాలంలో 700 పరుగులు చేశాడు. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మయాంక్ అగర్వాల్ తర్వాత రోహిత్ శర్మ(630), క్వింటన్ డీకాక్(629), బెన్ స్టోక్స్(627) ఉన్నారు.

సఫారీలతో మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ బాదిన మయాంక్‌ ఈ మ్యాచ్‌లో సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా, ఇప్పుడు బంగ్లాతో ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో మెరిశాడు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.