(Local) Mon, 20 Jan, 2020

క్లార్క్‌కు చర్మ క్యాన్సర్‌..యువతకు హెచ్చరిక

September 10, 2019,   4:55 PM IST
Share on:
క్లార్క్‌కు చర్మ క్యాన్సర్‌..యువతకు హెచ్చరిక

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, భయంకరమైన వ్యాధి క్యాన్సర్‌. ప్రపంచములో అత్యధిక మరణాలకు కారణమవుతున్న మూడు ముఖ్యరోగాలలో క్యాన్సర్ ఒకటి. ఆ వ్యాధికి గురైన రోగి అవస్థ చూసునపుడు పగవాడికి కూడా ఇటువంటి కస్టము రాకూడదని అనిపిస్తుంది . ఇటువంటి క్యాన్సర్‌ మహమ్మారి బారిన పడినవారిలో సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. అయితే ఈ క్యాన్సర్ బారిన పడిన సెలబ్రిటీస్ లో భారత దేశపు క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ కూడా ఒకరు. యువీ ప్రారంభ దశలోనే క్యాన్సర్ ను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుని, వైద్యం చేయించుకుని ఈ మహమ్మారి నుండి బయట పడిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో క్రికెటర్ ఈ క్యాన్సర్ బారి నుండి బయటపడ్డాడు. గత కొంతకాలంగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అయితే, ఇటీవల అతడి నుదిటి భాగంలో ఏర్పడిన క్యాన్సర్‌ కణితిని వైద్యులు విజయవంతంగా తొలగించారు. చికిత్స అనంతరం నొసటి మధ్య కత్తి గాటుతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో క్లార్క్‌ షేర్‌ చేయడం గమనార్హం.ఫోటోను షేర్ చేస్తూనే.. ‘ఎండలో తిరిగేటప్పడు జాగ్రత్త’ అని క్లార్క్ యువతను హెచ్చరించాడు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.