(Local) Mon, 21 Oct, 2019

ధోని ప్లాన్ ఏంటి?

September 14, 2019,   4:42 PM IST
Share on:
ధోని ప్లాన్ ఏంటి?

28 ఏళ్ళ భారత ప్రజల కలని నిజం చేసిన వ్యక్తి అతను. ప్రపంచకప్ ను గెలిపించి ప్రతి ఒక్కరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాడు. అలాంటిది అతని మీదే ఇప్పుడు జోరుగా చర్చ సాగుతుంది. ఆయనే..''మహేంద్ర సింగ్ ధోని''.
ధోని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయనే పేరు వింటే చాలు అతను అందించిన విజయాలు మన ముందు కదులుతూనే ఉంటాయి. టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకు జరిగిన అతని ప్రయాణం ఒక ఆదర్శం. ధోని గత కొన్ని రోజులుగా క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్ కప్ తరువాత ధోని వెస్టిండీస్ లో జరిగే మ్యాచ్ లకు దూరంగా ఉండాలని అనుకున్నాడు. ఆ సమయంలో రెండు నెలలపాటు సైనికుడిగా జమ్మూకాశ్మీర్ లో తన విధులు నిర్వర్తించాడు.ఇదిలా ఉండగా ధోని రిటైర్మెంట్ కాబోతున్నట్టు వార్తలు రావడంతో బీసీసీఐ షాక్ కు గురైంది. కానీ దీనిపై ఇంకా ఎవరికీ స్పష్టత రాలేదు.ఒకవేళ ధోని తన రిటైర్మెంట్ ప్రకటిస్తే బీజేపీలో చేరతారని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే జార్ఖండ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి బీజేపీ తరపున ఆయన పోటీ చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జార్ఖండ్ కు ధోని నాయకత్వం అవసరమని బీజేపీ భావిస్తోంది. ధోని టీంని ఎలా నడిపిస్తాడో, తన వేగం ఏంటో అందరికి తెలుసు. ధోని ఆలోచనలు ఎలా ఉంటాయో, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికీ తెలీదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

సంబంధిత వర్గం
ధోని గురించి సెలెక్టర్లతో మాట్లాడనున్న గంగూలీ
ధోని గురించి సెలెక్టర్లతో మాట్లాడనున్న గంగూలీ
ప్రపంచ టీ20 కోసం టీం ఇండియా ప్రయోగాలు
ప్రపంచ టీ20 కోసం టీం ఇండియా ప్రయోగాలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.