(Local) Fri, 19 Jul, 2019

ఐపీఎల్ 12 ఫైనల్ : ఉత్కంతపోరులో ముంబై గెలుపు

May 13, 2019,   11:04 AM IST
Share on:

ఐపీఎల్ లో చెన్నై పై ఆశలు పెట్టుకున్న అభిమానులకు చివరికి నిరాశే మిగిలింది.ఐపీఎల్ ఆఖరి పోరు కూడా ఉత్కంఠ భరితంగా సాగింది . అయినా సాధారణ లక్ష్యం మాత్రమే ముంబై ప్రత్యర్థి జట్టుకు ఇచ్చినా, దానిని కూడా ఛేదించకుండా కట్టుదిట్టంగా పోరాడింది. దీనితో చివరి బంతి వరకు ఉత్కంఠ తప్పలేదు.. మొదటి నుండి తన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో కూడా ముందున్న మొత్తానికి ఈ సీజన్ ఐపీఎల్ టైటిల్ ముంబై ఎగరేసుకుపోయింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌-12 ఫైనల్లో ముంబయి ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. కీరన్‌ పొలార్డ్‌ (41 నాటౌట్‌; 25 బంతుల్లో 3×4, 3×6) జట్టును ఆదుకున్నాడు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేయగలిగింది. ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ (80; 59 బంతుల్లో 8×4, 4×6) పోరాడినా చివరి మెట్టుపై చతికిలపడ్డాడు. బుమ్రా (2/14), రాహుల్‌ చాహర్‌ (1/14) అద్భుత బౌలింగ్‌తో ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.