(Local) Wed, 23 Oct, 2019

ప్రపంచ కప్ : టీమిండియాపై కివీస్ ఘనవిజయం

July 10, 2019,   10:35 PM IST
Share on:
ప్రపంచ కప్ : టీమిండియాపై కివీస్ ఘనవిజయం

బుధవారం జరిగిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్, ఫైనల్ ను తలపించింది. తీవ్ర ఉత్కంఠల నడుమ సాగిన ఈ మ్యాచులో కివీస్ 18 పరుగుల తేడాతో గెలిచింది. మూడు బంతులు మిగిలుండగానే భారత్ 221 పరుగులకు ఆలౌట్ అయింది. మొదట భారత టాపార్డర్లు విఫలం చెందడంతో భారత అభిమానులు మ్యాచ్ పై ఆశలు వదులుకున్నారు. రిషబ్ పంత్ మరియు హార్దిక్ పాండ్యలు నిలకడగా ఆడడంతో భారత విజయంపై ఆశలు చిగురించాయి. వీరికి కొనగగింపుగా 32వ ఓవర్లో వచ్చిన రవీంద్ర జడేజా నెమ్మదిగా ఆడుతూ.. చివరి పవర్ ప్లేలో దూకుడును ప్రదర్శించాడు. 4 సిక్సులు, 4 ఫోర్లతో కివీస్  బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నప్పటికీ, ధోని నుంచి సరైన సహకారం లభించలేదు. దీటుగా ఆడిన జడేజా నిష్క్రమణతో పాటు తరువాతి వికెట్లు కూడా వెంటవెంటనే కోల్పోవడంతో భారత్ కు విజయం దక్కలేదు. కివీస్ బౌలర్లలో హెన్రీ 3, ట్రెంట్ బౌల్ట్ 2, శాంతనర్ 2, ఫెర్గుసన్ 1, నీషం 1 చొప్పున వికెట్లు తీశారు. భారత బ్యాట్స్ మెన్ లలో రిషబ్ పంత్ (32), హార్దిక్ పాండ్య (32), ధోని(50), జడేజా (77) లు రాణించారు

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.