(Local) Thu, 18 Jul, 2019

ఆభిమానులు నిరాశ చెందినా టీమిండియా అద్భుత పోరాటం: రాహుల్‌

July 11, 2019,   2:56 PM IST
Share on:

ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలైన టీమిండియాకు రాహుల్‌గాంధీ మద్దతు తెలిపారు. మాంచెస్టర్‌ వేదికగా మంగళవారం జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా బుధవారం కొనసాగిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. అనంతరం భారత్‌ 221 పరుగులకు ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో కోట్లాది మంది అభిమానులు నిరాశ చెందినా టీమిండియా అద్భుత పోరాటం చేసిందని మెచ్చుకున్నారు. భారత ఆటగాళ్లు ప్రదర్శించిన పోరాటపటిమకు అభిమానుల ప్రేమ, గౌరవం దక్కించుకున్నారని రాహుల్‌ తెలిపారు.

అలాగే ఫైనల్స్‌ చేరిన న్యూజిలాండ్‌ జట్టుకు రాహుల్‌ అభినందనలు చెప్పారు. ఇదిలా ఉండగా అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ సైతం భారత ఆటగాళ్లని కొనియాడారు. ఓటమి నిరాశపర్చినా ఆటగాళ్ల పోరాటం బాగుందన్నారు. టోర్నీ ఆసాంతం కోహ్లీసేన బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో బాగా రాణించిందని, అందుకు తామంతా గర్వంగా భావిస్తున్నామని చెప్పారు. జీవితంలో గెలుపోటములు సహజమని మెదీ పేర్కొన్నారు.  

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.